Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తాం: మంత్రి సబిత

Webdunia
సోమవారం, 8 మార్చి 2010 (18:41 IST)
FILE
రానున్న రోజుల్లో రాష్ట్రంలో దాదాపు రెండు వేలమంది మహిళా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు సోమవారం రాష్ట్ర హోం శాఖామంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు.

రాష్ట్ర రాజధాని సమీపంలోనున్న బేగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్‌ను హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం మంత్రి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో మహిళా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నామన్నారు.

దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేస్తామని, నోటిఫికేషన్‌కు సంబంధించి తమ శాఖాధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారన్నారు. ఇందులో భాగంగా దాదాపు రెండు వేలమంది మహిళలకు తమ ప్రభుత్వం పోలీసు శాఖలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు.

రాష్ట్రంలోని మహిళా పోలీసులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌ను ఆమె తనిఖీ చేసినప్పుడు ఆమెవెంట పోలీస్ కమిషనర్ ఏ.కె.ఖాన్ కూడా ఉన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments