Webdunia - Bharat's app for daily news and videos

Install App

2015 నాటికి 55 మిలియన్ ఉద్యోగాలు అవసరం

Webdunia
మొత్తంలో జనాభాలో ఇప్పుడున్న 39 శాతం ఉపాధి రేటును కొనసాగించాలంటే 2015 నాటికి భారత్‌కు అదనంగా 55 మిలియన్ల ఉద్యోగాలు అవసరమని క్రిసిల్ అనే పరిశోధన సంస్థ అభిప్రాయపడింది.

' భారత్‌లో ఉపాధి: ఎగుడుదిగుడు-బలహీనం' అనే పేరుతో క్రిసిల్ తయారు చేసిన నివేదికలో ఉపాధి కల్పన రేటును రెండింతలు చేయాలని సూచించింది. 2000-05లో 27.2 మిలియన్ ఉద్యోగాలు సృష్టించగా 2005-10 కాలంలో 27.7 మిలియన్ల ఉద్యోగాల కల్పన జరిగింది.

" జీడీపీ వృద్ధికి అనుగుణంగా ఉద్యోగాల కల్పన జరుగలేదు. జీడీపీ వృద్ధి 2000-05లో నమోదైన ఆరు శాతం నుంచి 2005-10 కాలానికి 8.6 శాతానికి పెరిగింది. అయితే ఉద్యోగాల కల్పన ఈ స్థాయిలో జరుగలేదని" క్రిస్ ముఖ్య ఆర్థికవేత్త డీకే జోషి చెప్పారు. 2005-10 కాలంలో స్వయం ఉపాధి పొందే వారి సంఖ్య తగ్గిపోవడంతో ఉపాధి కల్పన కూడా క్షీణించిందని జోషి అభిప్రాయపడ్డారు.

ఉపాధిపై నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ సమాచారం ఆధారంగా చేపట్టిన ఈ అధ్యయనం సరైన విధానం లేకుండా 55 మిలియన్ ఉద్యోగాల కల్పన కష్టసాధ్యమని వెల్లడించింది. ప్రోత్సాహక వాతావరణంలేని కారణంగా అధిక ఉపాధిని కల్పించే సామర్థ్యం కలిగిన తయారీ, సేవా రంగాలు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments