Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైన్సులో పెరుగుతున్న ఉద్యోగావకాశాలు..

Webdunia
శుక్రవారం, 18 జులై 2008 (16:51 IST)
FileFILE
కంప్యూటర్ పారిశ్రామిక రంగం ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రస్తుతం యువత ఎక్కువగా కంప్యూటర్ రంగంపైనే దృష్టి సారించిందని చెప్పడానికి అనేక కారణాలున్నాయి. జీతభత్యాల విషయాల్లోనైతేనేమీ.. ఇతర వెసలుబాట్లు కల్పించడంలోనైతేనేమీ అన్నింటిలోను కంప్యూటర్ రంగంలో ఉన్నన్ని సౌలభ్యాలు మరి దేనిలోను లేవంటే అతిశయోక్తి కాదేమో.

కాసేపు కంప్యూటర్ మాట అటుంచితే అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా వన్నె తగ్గని రంగం సైన్స్ రంగం. నేడు చంద్రమండలానికి మనిషి వెళుతున్నాడంటే.. అందుకు కారణం సైన్స్. జన్యు మార్పులను చేసేంత స్థాయికి ఎదిగాడంటే.. సాంకేతిక విజ్ఞానమే. దీన్ని బట్టి అన్ని రంగాల్లో కెల్లా సైన్స్‌ రంగం ఓ ప్రత్యేకమైన స్థానం ఎప్పటికీ కలిగి ఉంటుందన్నది సత్యం.

నేడు అతి కొద్ది మంది మాత్రమే ఎంచుకునే సైన్స్ రంగంలో ఉద్యోగావకాశాలు 17శాతం మేర పెరగనున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విశ్లేషణలను పరిశీలిస్తే... 2005లో సైన్స్ మరియు సాంకేతిక రంగంలో 27,791 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటనలు వచ్చాయి.

అలాగే 2006లో 32,362 ఖాళీలకు సంబంధించి ప్రకటనలు వచ్చినట్లు ఈ అధ్యయనం చేపట్టిన కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక విభాగం నేతృత్వంలోని మేన్‌పవర్ మేనేజ్‌మెంట్ సెంటర్ (ఎంఎంసీ) ఈ ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. 2005, 2006లలోని శాస్త్ర, సాంకేతిర రంగాల్లో గల ఉద్యోగావకాశాలను పరిశీలిస్తే 17శాతం పెరిగినట్లు తెలిసింది.

విద్యాసంస్థల్లో సైన్సు విద్యను మెరుగుపరచడంలో ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని... అలాగే బడ్జెట్‌లో విద్యారంగానికి ఎక్కువ నిధులను కేటాయించడం వంటి తదితర కీలక నిర్ణయాలు శాస్త్ర, సాంకేతిక రంగ పురోగభివృద్ధి సాధ్యపడినట్లు ఎంఎంసీ విశ్లేషించింది.

2003-04 మరియు 2004-05 విద్యాసంవత్సరాలను పరిశీలిస్తే దేశంలో మొత్తం 5,612 పీహెచ్‌డీ సైన్స్ విద్యాభ్యాస కేంద్రాలుండగా... వాటిలో గుర్తింపు పొందినవి
5,549 కేంద్రాలున్నాయి. గణాంకాల ప్రకారం లెక్కిస్తే.. సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్ధుల సంఖ్య పెరగలేదని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments