Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన పైలట్‌లకు పెరుగనున్న గిరాకీ

Munibabu
దేశంలో విమానయాన సంస్థలు పెరుగుతుండగా ఆయా సంస్థల్లో పైలట్‌లుగా పనిచేయడానికి అవసరమైన పైలట్‌లు మాత్రం దేశంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో లేదు. ఈ కారణంగా ఇటీవలి కాలంలో పైలట్లుగా శిక్షణ తీసుకున్న వారికి గిరాకీ ఏర్పడుతోంది. ఇలాంటి తరుణంలో పైలట్‌గా శిక్షణ పొంది ఉంటే మంచి ఉద్యోగ అవకాశంతో పాటు ఆకర్షణీయమైన జీతం కూడా లభించే అవకాశముంది. ఇంతటి గిరాకీ ఉన్న పైలట్ శిక్షణ గురించి మనదేశంలో అమలులో ఉన్న విధానం గురించి ఓసారి వివరాలు తెల్సుకుందాం.

విమానయాన సంస్థల్లో ప్రస్తుతం విదేశీ పైలట్ల హవానే సాగుతోందని చెప్పవచ్చు. దేశంలో కావల్సినంతమంది పైలట్ శిక్షణ తీసుకున్న వారు లేకపోవడం, ఉన్నా వారు సీనియర్ పైలట్ బాధ్యతలు నిర్వహించేంతటి స్థాయిలో ఉండకపోవడంలాంటి కారణాల వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లోని అనేక విమానయాన సంస్థల్లో విదేశీ పైలట్‌లే అగ్రస్థానంలో ఉన్నారు.

అయితే ఈకారణంగా దేశంలో పైలట్ శిక్షణ తీసుకున్నవారికి సరైన ఉపాధి అవకాశాలు లేకుండా పోతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం దేశీయ పైలట్లకు లాభం చేకూరేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఏ విమానయాన సంస్థ కూడా కో పైలెట్లుగా విదేశీయులను నియమించరాదు. అలాగే రానున్న 2010 నుంచి సీనియర్ పైలట్ల స్థానంలో సైతం స్వదేశీయులనే నియమించాలని కూడా రెకమండ్ చేసింది.

పై రెండు అంశాల మూలంగా రానున్న రెండేళ్లలో స్వదేశీ పైలట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడనుంది. ఇలాంటి తరుణంలో పైలట్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి చక్కటి అవకాశాలు తలుపుతట్టే అవకాశముంది. దీనికి తోడు విమానయాన సంస్థలు ఎక్కువైన కారణంగా వారు తక్కువ జీతానికి పనిచేసే పైలట్ల కోసం ఎదురుచూస్తున్నారు.


ఈ కారణంగా కూడా స్వదేశీ పైలట్లకు ఉపాధి పెరిగే అవకాశముంది. ప్రభుత్వ నిర్ణయం, విమానయాన సంస్థల నిర్ణయం ఒకేలాగా ఉన్నందున పైలట్ శిక్షణకు తీసుకునే వారికి సంబంధించి ప్రస్తుతమున్న కొన్ని అర్హతలను సడలించాలని పైలట్ శిక్షణా సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

ప్రస్తుతం పైలట్ శిక్షణ తీసుకునే వారు ఇంటర్ స్థాయిలో తప్పకుండా సైన్స్, గణితం సబ్జెక్ట్‌లు చదివి ఉండాలని ప్రభుత్వం నిబంధన విధిస్తోంది. అయితే ఈ నిబంధన వల్ల పైలట్ శిక్షణపై ఆసక్తి ఉన్న ఇతర సబ్జెక్ట్ విద్యార్ధులు ఈ కోర్సులో చేరే అవకాశం లేదని పైలట్ శిక్షణా కంపెనీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనను సడలించాలని ఆ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

అయితే ఈ అభ్యర్ధనపై విమానయాన మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైలట్ శిక్షణలో ప్రవేశించే విద్యార్ధులకు సంబంధించిన విద్యార్హతల్లో ఎలాంటి నిబంధనలు విధించలేదని శిక్షణా సంస్థలు పేర్కొంటున్నాయి. ఆయా దేశాలకు సంబంధించి చక్కటి ఇంగ్లీషు పరిజ్ఞానం, ఆరోగ్యం ఉంటే చాలని భావిస్తున్నాయని ఆయా సంస్థలు చెబుతున్నాయి.

అందుకే ఎక్కువమంది పైలట్‌లను తయారు చేయాలంటే నిబంధనలు సడలించాలని సంస్థలు చెబుతున్నాయి. దీంతో పైలట్ శిక్షణకు సంబంధించి విద్యార్హతల నిబంధనను సడలించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పైలట్ శిక్షణపై ఆసక్తి ఉన్న వారికి అవకాశాలు అందివచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments