Webdunia - Bharat's app for daily news and videos

Install App

రచయితలకు మంచి రోజులు

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2007 (15:57 IST)
మీలో ఆంగ్లభాషా పరిజ్ఞానం పుష్కలంగా ఉందా? అద్భుతమైన సృజనాత్మకతతో పద విన్యాసం చేసే ప్రజ్ఞాపాటవం మీకు నల్లేరుపై నడక లాంటిదా? మీలాంటి వాళ్లకు గ్రీటింగ్ కార్డు పరిశ్రమ స్వాగతం చెపుతున్నది. గ్రీటింగ్ కార్డుల పరిశ్రమ రచయితలకు లాభాల పంట పండించే స్వర్గసీమ.

అదేసమయంలో ఇతర రచనావ్యాసాంగాలతో పోల్చుకుంటే గ్రీటింగ్ కార్డుల రూపకల్పనలో రచయిత పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఇందులో రాతలన్నీ "నాకు నీవు - నీకు నేను" అన్న దోరణిలో సాగుతూ వ్యక్తుల భావపరంపరకు మార్గం చూపే సారధులుగా ఉండాలి. కార్డును పంపేవారికి, స్వీకరించేవారికి నడుమ రచయిత రాయబారిగా వ్యవహరించవలసి ఉంటుంది.

ఇదిలా ఉండగా ఆకాశమే హద్దుగా సాగుతున్న గ్రీటింగ్ కార్డుల పరిశ్రమ ఇప్పటికే రూ.250 కోట్లకు చేరుకుంది. గణనీయంగా పెరుగుతున్న రిటైల్ రంగం గ్రీటింగ్ కార్డుల పరిశ్రమ వృద్ధికి చేయూతనిస్తున్నది. దీంతో గ్రీటింగ్ కార్డుల పరిశ్రమలో సృజనాత్మకత కలవారికి ఉద్యోగ అవకాశాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఆంగ్లభాషపై మంచిపట్టు ఉండి కవితాత్మకంగా వ్రాయగలిగే సత్తా ఉన్నవారికి ఈ పరిశ్రమ రెడ్‌కార్పట్ పరిచి మరీ స్వాగతిస్తున్నది. ఎలాంటి అనుభవంలేకుండా రచయితగా ఈ రంగంలోకి కొత్తగా నెలసరి వేతనంగా రూ. 10,000 లభిస్తుండగా, రచయితగా అనుభవజ్ఞులై గ్రీటింగ్ కార్డుల రూపకల్పనలో సిద్ధహస్తులైన రచయితలకు రూ. 60,000 నెలసరి వేతనంగా లభిస్తున్నది.

దుకాణాలలోని గ్యాలరీలలో వరుసగా పేర్చి ఉండే గ్రీటింగ్ కార్డులలో నచ్చని దానిని వీక్షకులు ఒకటిన్నర సెకండ్లలలోనే తిరస్కరించి మరో కార్డు వైపు దృష్టిని మరలుస్తారు. కనుక గ్రీటింగ్ కార్డుల రూపకల్పనలో రోజురోజుకి మారుతున్న ప్రజల అభిరుచులను, ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని రచయిత వ్యవహరించాలి. అలాగే గ్రీటింగ్ కార్డుపైనున్న చిత్రానికి, రచనకు సరియైన పొంతన ఉండాలి. అప్పుడే గ్రీటింగ్ కార్డు యొక్క ప్రయోజనం నెరవేరినట్లు అవుతుంది.

అయితే ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే ఔత్సాహిక రచయితలు ముందుగా తమ రచనలను చిన్న మరియు మధ్యతరహా కంపెనీలకు అందించాలి. ఆయా కంపెనీల ఆమోదాన్ని పొందిన రచనలు, గ్రీటింగ్ కార్డులతో చేరి మార్కెట్‌లో ప్రవేశించి పలువురి మన్ననలను పొందిన మరుక్షణం, రచయితకు అవకాశాలు వాటింతటవే వచ్చి పడతాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

Show comments