Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక స్థిరత్వంతోనే సక్సెస్...

Gulzar Ghouse
శనివారం, 6 ఫిబ్రవరి 2010 (16:58 IST)
FILE
ప్రస్తుతం దేశంలోని విద్యారంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటుండటంతో విద్యార్థులలో పోటీతత్వం (కాంపిటీషన్) పెరిగిపోతోంది. ప్రతి విద్యార్థి తమ కెరియర్‌లో ముందుండేందుకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. అందులో విజయం సాధించేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. దీంతో ప్రతి విద్యార్థిలోను మానసికపరమైన ఒత్తిడి పెరిగిపోతోంది.

తమ కెరీర్ ఎంబీఏ కావచ్చు లేక హోటల్ మేనేజ్‌మెంట్, రేడియో జాకీ, యానిమేటర్, డాక్టర్, చార్టెడ్ అకౌంటెంట్, ఇంజనీర్ ఏ రంగమైనా కావచ్చు. అందులో రాణించేందుకు, పరీక్షలలో మంచి మార్కులు సంపాదించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. దీంతో మానసిక ఒత్తిడికి గురౌతుంటారు. కొన్ని సందర్భాలలో మంచి ఫలితాలు సాధించలేకపోతే నిరాశచెంది తాము నిర్దేశించుకున్న లక్ష్యాలపై తమకు తామే నీళ్ళు చల్లుకుంటుంటారు.

కాబట్టి ప్రతి విద్యార్థికి మానసికపరమైన స్థిరత్వం కావాలంటున్నారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. అంటే ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతోనే స్వీకరించాలి. దీంతో మీరు అనుకున్న ఫలితాలు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ఏమాత్రం నిరాశచెందక మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుండాలి. లేదా మీరు ప్రిపేర్ అయ్యే పరీక్షలకు అవి పోటీ పరీక్షలు కావచ్చు, లేదా మీ తరగతికి సంబంధించిన పరీక్షలు కావచ్చు. ఆయా సబ్జెక్టులకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రణాళికాబద్దంగా (టైంటేబుల్) ప్రిపేర్ అయితే ఎలాంటి సమస్యా ఏర్పడదు.

మీ సీనియర్స్ చెప్పే మాటలు, వారి ప్రిపరేషన్ ఎలా ఉండింది తెలుసుకోండి. వారు చేసిన తప్పులు మీరు చేయకుండా సరిదిద్దుకోండి. ప్రతికూల పరిస్థితుల్లోను మీ సీనియర్స్ పరీక్షలలో ఎలా నెగ్గుకురాగలిగారో తెలుసుకోండి. ఇలాంటి వారు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. వారి అనుభవాలను తెలుసుకోండి. మీ సీనియర్స్ లేదా మీ కుటుంబ సభ్యుల అనుభవాలను కూడా తెలుసుకుంటుండి. దీంతోపాటు ఇంటర్నెట్ లేదా మ్యాగజైన్‌లలో సక్సెస్ స్టోరీలను చదవేందుకు ప్రయత్నించండి. ఇవి విద్యార్థులకు కాస్త ప్రోత్సాహకరం (ఇన్‌స్పైర్)గా ఉంటుంది.

దీంతో మీలో నూతన ఉత్సాహం వస్తుంది. వారి అనుభవాలను చదివిన తర్వాత మీకు- వారికి పెద్దగా తేడా లేదనిపిస్తుంది. కేవలం ఆలోచనలోనే మార్పులుంటాయి. ఎందుకంటే వారిలో మేము ఏదైనా చేయగలమనే ధీమా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులును సైతం లెక్క చేయకుండా ముందుకు దూసుకెళ్ళాలనే సంకల్పం మనసులో వచ్చినప్పుడు ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు.

సుఖ-దుఃఖాలు - సుఖ-దుఃఖాలనేటివి పక్కపక్కనే ఉంటాయి. దుఃఖం తర్వాత సుఖం, చీకటి తర్వాత వెలుతురు ఇలా రెండూ వెన్నంటే ఉంటాయని మరిచిపోకండి. అజ్ఞానులుగా ఉండి తర్వాత జ్ఞానులుగా మారినవారు చాలామంది ఉన్నారు. అంటే ఏమీ తెలియని విషయాలు శోధించి తెలుసుకున్న తర్వాత అన్ని విషయాలు తెలిసిపోతుంటాయి. ఓస్ ఇంతేనా అని మనకు మనమే అనుకుంటుండటం పరిపాటి. కొందరి సక్సెస్ స్టోరీలు చదివిన తర్వాత వారు సక్సెస్ సాధించే ముందు ఎంత కష్టపడ్డారో మనకు అర్థమౌతుంది. సో ఆల్ ది బెస్ట్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

Show comments