Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఐటి రంగానికి పునర్వైభవం, నియామకాల్లో జోరు

Webdunia
File
FILE
దేశంలో ఐటి రంగం పునర్వైభవాన్ని సంతరించుకోనుంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ ఐటి కంపెనీలు వృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఓ వైపు అమెరికా ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌పై నిషేధం విధిస్తానని ప్రకటించింన ప్రకటించినప్పటికీ భారత ఐటి కంపెనీలు ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా ఐటి వ్యాపారం ఊహించని విధంగా జోరందుకోవడంతో.. దేశంలోని ప్రధాన సాఫ్ట్‌వేర్ కంపెనీలు గత సెప్టెంబర్ నుంచి భారీగా సిబ్బంది నియామకాలను చేపట్టాయి. అయితే ఈ నియామకాల్లో ముఖ్యంగా ఇప్పటికే అనుభవం కలిగిన ప్రొఫెషనల్స్‌కే పెద్దపీఠ వేస్తున్నాయి.

గత 2009లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తెన ఆర్థిక మాంద్యం కారణంగా పలు ఐటి కంపెనీలు చతికిలబడ్డాయి. దాదాపు ఏడాదిన్నర పాటు నియామకాల్లో నెలకొన్న స్తబ్దత ఇప్పుడిప్పుడే తొలగిపోతుంది. గతేడాది నియామకాలతో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు నియామకాలు జరిగాయి.

ఈ ఏడాది అధిక సంఖ్యలో నియామకాలు చేపట్టిన కంపెనీలలో అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో పాటు మరో నాలుగు అగ్రస్థాయి దేశీయ కంపెనీలు కూడా రెట్టింపు సిబ్బందిని నియమించుకున్నాయి.

గడచిన 12 నెలల్లో కాగ్నిజెంట్ కొత్తగా 24,600 మంది ఉద్యోగులను నియమించి, రిక్రూట్‌మెంట్లలో మొదటి స్థానంలో ఉండగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 22,058 మందిని నియమించి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో ఇటువంట్ కంపెనీల్లో అట్రిషన్ రేటు కూడా (కంపెనీ నుంచి వెళ్లిపోయే ఉద్యోగుల సంఖ్య) ఎక్కువగానే ఉంది.

ఈ ఏడాది ఇన్ఫోసిస్, టీసీఎస్‌ కంపెనీలు కొత్తగా 75,000 మంది ఉద్యోగులను నియమంచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఉద్యోగులను నియమిస్తామని టీసీఎస్ ప్రకటించగా.. ఇన్ఫోసిస్ ఈ ఏడాది దాదాపు 36,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

గత ఏడాది కాలంగా క్యాంపస్ ఇంటర్వ్యూల ఊసెత్తని కంపెనీలు సైతం.. ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలపై దృష్టి సారించనున్నాయి. అయితే ఈ నియమాకాలు జొరు కొదిద కాలం మాత్రమే ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

భవిష్యత్ అవసరాలకు కావలసిని సిబ్బందిని నియమించడం ఇప్పటికే దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇకనుంచి రిక్రూట్‌మెంట్లు మందకొడిగా ఉంటాయని ఐటి అడ్వయిజరీ కంపెనీ టీపీఐ ఇండియా ఎండి సిద్ధార్థ్ పాయ్ వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ భారత ఐటి రంగం పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

Show comments