Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయ విద్యకు మంచి రోజులు

Webdunia
న్యాయ విద్యకు మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పటి వరకు లా కోర్సుల్లో అప్పుడే విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులతో సహా 60 యేళ్ళు నిండి పదవీ విరమణ చేసిన వయోవృద్దులు కలిసి చదువుకునే అవకాశం ఉండేది. ఈ పద్దతికి ఈ విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యామండలి స్వస్తి చెప్పింది. మూడు, ఐదేళ్ల లా కోర్సులో చేరడానికి వయోపరిమితి విధించింది.

ఈ విద్యాసంవత్సరం న్యాయ కోర్సులో ప్రవేశం పొందాలంటే మూడేళ్ల కోర్సుకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులకు మాత్రం ఐదేళ్ళ వరకు సడలింపు ఉంటుంది.

అలాగే, ఐదేళ్ళ లా కోర్సులో చేరడానికైతే గరిష్ట వయోపరిమితిని 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. బిసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేవలం రెండేళ్లు మాత్రమే సడలింపు ఇచ్చారు. అంటే 22 ఏళ్లుదాటితే ఐదేళ్ల లా కోర్సులో చేరడానికి ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా అనర్హులు, 35 సంవత్సరాల వయస్సు దాటితే మూడేళ్ల లాకోర్సులో ప్రవేశం లేదు.

అందువల్ల వచ్చే మూడేళ్ల తర్వాత యువ న్యాయవాదులు పెరిగే అవకాశం ఉంది. న్యాయశాస్త్రం చదవాలంటే కనీస విద్యార్హతతోపాటు వయోపరిమితి విధించింది. ఏ విద్యార్హత లేకున్నప్పటికీ ఓపెన్‌ వర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా మూడేళ్ల లా కోర్సులో ఎంట్రెన్స్ రాసి సీటు పొందే అవకాశం ఉండేది.

ఈ విధానాన్ని కూడా ఈ విద్యాసంవత్సరం తొలగించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులు కావాలంటే సంప్రదాయ విద్య (10+2+3) చదివి తీరాల్సిందే. అంతేకాకుండా డిగ్రీ సింగిల్‌ సిట్టింగ్‌లో పూర్తిచేసిన వారు న్యాయశాస్త్రం చదవడానికి అనర్హులు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

Show comments