Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో ఎలక్ట్రీషియన్లకు, ప్లంబర్లకు లక్కీ ఛాన్స్

Webdunia
శుక్రవారం, 18 ఏప్రియల్ 2008 (10:35 IST)
దుబాయ్‌లో ఓ అంతర్జాతీయ నిర్మాణ రంగ కంపెనీ 125 మంది ఎలక్ట్రీషియన్, 35 మంది ప్లంబర్లు, 15 మంది పైప్ ఫిట్టర్ల ఉద్యోగావకాశాలకై అభ్యర్థులను ఆహ్వానిస్తోంది.

సంబంధిత రంగాల్లో ఐటీఐ, డిప్లొమా, ఎస్.ఎస్.సీ చేసి, కొంత వరకు గృహ, పరిశ్రమల విద్యుదీకరణ పనుల్లో అనుభవం కలిగిన వారు ఎలక్ట్రీషిన్ పోస్టులకు, సంబంధిత రంగాల్లో ఐటీఐ, డిప్లొమా చేసి అనుభవం కలిగిన వారు ప్లంబర్లు, ఫిట్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తుది ఇంటర్వ్యూ చెన్నై, బెంగళూరు, కొచ్చి, ముంబైలలో ఉంటుంది. సంబంధిత దస్తావేజులతో అభ్యర్థులు మానిక్ ట్రావెల్స్ (కెనరా బ్యాంకు ఎదురుగా), వకోలా బ్రిడ్జి, శాంతాక్రుజ్ (తూర్పు) ముంబై-45 చిరునామాలో సంప్రదించవచ్చు. ఇతర వివరాలనుఆ సంస్థను 022-66920263 నెంబర్‌లో ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు.

వీరు గాక 4 ప్రాజెక్టు మేనేజర్ పోస్టులకు ఎలక్ట్రికల్ లేక మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసి, 15 ఏళ్ల వరకు అనుభవం కలిగిన వారిని, 8 ప్లానింగ్ ఇంజనీర్ పోస్టులకై ఇంజనీరింగ్ డిగ్రీతో అనుభవం కలిగిన వారిని కూడా ఆహ్వానిస్తోంది.

అలాగే 8 ఎలక్ట్రికల్ సైట్, ప్రాజెక్టు ఇంజనీర్ ఉద్యోగాల కోసం సంబంధిత రంగంలో డిగ్రీ పూర్తి చేసి, ఐదేళ్లకు పైగా అనుభవం కలిగిన వారిని, 10 ప్లంబింగ్ సూపర్‌వైజర్ ఉద్యోగాల కోసం డిప్లొమా, లేక ఐటీఐ చేసి, ఐదేళ్లకు పైగా అనుభవం కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments