Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక విదేశాల్లో మన బీ'టెక్కులు' చెల్లుతాయ్

Webdunia
మంగళవారం, 27 మార్చి 2012 (16:50 IST)
WD
స్వదేశీ బిటెక్ డిగ్రీలతో విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయ యువత కలలు త్వరలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారతీయ బీటెక్ సర్టిఫికెట్లకు విదేశాల్లో సరైన గుర్తింపు లేని పరిస్థితిలో ఇక్కడి యువత విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత విద్యకు చాలా కష్టపడాల్సివస్తోంది. దాన్ని అధిగమించేందుకు మన దేశం ప్రఖ్యాత వాషింగ్టన్ అకార్డ్ సంస్థలో సభ్యత్వానికి పావులు కదుపుతోంది.

వాషింగ్టన్ అకార్డ్ అనేది అంతర్జాతీయంగా ఇంజనీరింగ్ విద్యా సంస్థల ప్రమాణాల పెంపునకు కృషి చేస్తోంది. ఈ సంస్థలో ఇప్పటికే పలు దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ సంస్థలో సభ్యత్వం ఉన్న దేశాల విద్యార్ధులు ఇతర దేశాల్లో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు ఏమంత కష్టపడాల్సిన అవసరం ఉండదని చెపుతారు.

సంస్థలో సభ్యత్వానికి మనకు గనుక లైన్ క్లియర్ అయితే, మనదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ చేసిన అబ్బాయిలు, అమ్మాయిలు విదేశాలకు వెళ్లడానికి పడే తిప్పల్లో సగానికి సగం తగ్గిపోతాయి. మన బీటెక్ డిగ్రీలు కూడా ఇకపై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జపాన్ తదితర దేశాల డిగ్రీలకు సమానంగా గుర్తింపు పొందుతాయి.

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ) అనుబంధ సంస్థయిన జాతీయ అక్రిడేషన్ బోర్డ్(ఎన్‌బిఎ) ఈ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే వాషింగ్టన్ అకార్డ్‌లో శాశ్వత సభ్యత్వానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

వచ్చే ఏడాది 2013 నాటికి ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే, మనం దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన ఆ సంస్థలో సభ్యత్వాన్ని పళ్లెంలో పెట్టేసి తీసేసుకోండంటూ ఇచ్చే అవకాశం అంత సులభం కాకపోవచ్చు. ఇప్పటికే దాదాపు వంద దేశాలకు పైగా సభ్యత్వ దరఖాస్తులు ఆ సంస్థలో పెండింగ్‌లో ఉన్నాయంటే, సంస్థలో సభ్యత్వం దక్కడమంటే ఎంత కష్టమో అర్ధం చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్ విద్యలో ఆయా దేశాలు అనుసరిస్తున్న జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు ఎలా ఉన్నాయీ? బోధనా తీరులేమిటీ, ప్రపంచ పోకడలకు అనుగుణంగా అవి తీరు మార్చుకుంటున్నాయా లేక మూస విధానాల్లోనే ముందుకు సాగుతున్నాయా? లాంటి అంశాల ఆధారంగా సంస్థలో సభ్యత్వం దక్కుతుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga chaitanya Sobhita dhulipala Wedding నాగచైతన్య-శోభిత పెళ్లి

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... చిన్నారి డ్యాన్స్ అదిరింది.. (వీడియో)

క్రైం థ్రిల్లర్ గా వరుణ్ సందేశ్ చిత్రం కానిస్టేబుల్

మోక్షజ్ఞతో ఆదిత్య 369కి సీక్వెల్‌ గా ఆదిత్య 999 మ్యాక్స్

డ్రింకర్ సాయి బ్యాడ్ బాయ్స్ బ్రాండ్ తో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Show comments