Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవాస విద్యార్థులకు కేంద్రంచే స్కాలర్‌షిప్‌లు

Webdunia
సోమవారం, 13 అక్టోబరు 2008 (14:09 IST)
FileFILE
విదేశాల్లో విద్యనభ్యసిస్తోన్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రవాస భారతీయుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా.. మొత్తం 100 మందిని ఈ స్కాలర్‌షిప్‌లకుగానూ ఎంపిక చేస్తారని, ఇప్పటిదాకా వీటికోసం 400 మంది దరఖాస్తు కూడా చేసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది.

విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల కోసం ఈ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం వీటి కోసం ఒమన్ నుంచి 87, కువైట్ నుంచి 76, సౌదీ అరేబియా నుంచి 60, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ నుంచి 31, బహ్రెయిన్ నుంచి 27 మంది దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీలంక నుంచి కూడా ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేయడం విశేషం. కాగా, వీరందరికీ అక్టోబర్ 26వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. అధికసంఖ్యలో భారతీయులు నివసిస్తోన్న 40 దేశాలలో ఈ పరీక్ష జరుగనుంది.

పరీక్షల అనంతరం.. నవంబర్ నెలలో స్కాలర్‌షిప్‌ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని, ఆయా దేశాలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు... విద్యార్థులు సంస్థల్లో చేరే విధంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రవాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments