Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ

Webdunia
సోమవారం, 5 జులై 2021 (18:46 IST)
Anant Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ నియమితులయ్యారు. గ్రూప్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ.. జూన్ 24వ తేదీన నిర్వహించిన ఆర్ఐఎల్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాబోయే మూడేళ్లలో 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇంధన వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో రిలయన్స్ O2C బోర్డులో ముకేశ్, నీతా అంబానీల చిన్న కుమారుడిని నియమించారు. చిన్న వయస్సుల్లోనే డైరెక్టర్‌గా నియమితులు కావడం విశేషం.
 
ఇందులో సౌదీ అరాంకో పెట్టుబడి పెట్టనున్నారు. అనంత్ అంబానీ జియో ప్లాట్ ఫామ్స్ బోర్డులో డైరక్టర్‌గా కూడా పని చేస్తున్నారు. ఇషా, ఆకాష్ కూడా సభ్యులుగా ఉన్నారు. సోలార్‌ తయారీ కేంద్రాల నిర్మాణం, ఎనర్జీ స్టోరేజీ కోసం బ్యాటరీ కర్మాగారం ఏర్పాటు దిశగా వెళ్తున్నట్లు ప్రకటించారు. 
 
ఫ్యూయెల్‌ సెల్‌ ఉత్పాదక ప్లాంట్‌తోపాటు గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి ఎలక్ట్రోలైజర్‌ యూనిట్‌ను నెలకొల్పనున్నామని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ గతంలో ప్రకటించారు. నాలుగు కర్మాగారాల్లో రూ. 60 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
 
సోలార్‌ పవర్‌ వైపు రిలయన్స్‌ దృష్టి సారించింది. 2030 నాటికి పవర్ సామర్థాన్ని సంతరించుకోవాలని చూస్తోంది. ఓ కార్బన్ ఫైబర్ ప్లాంట్ కోసం పెట్టుబడులు పెడుతామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. 
 
సంస్థ ఆదాయంలో దాదాపు 60 శాతం హైడ్రోకార్బన్‌ ఆధారిత ఇంధన కార్యకలాపాల ద్వారానే సమకూరుతోంది. ఈ క్రమంలో…2035 నాటికి కార్బన్‌ రహిత సంస్థగా ఆర్‌ఐఎల్‌ (RIL) ను నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments