దేశవ్యాప్తంగా మూతపడుతున్న ఏటీఎంలు...

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (14:34 IST)
దేశవ్యాప్తంగా ఏటీఎం కేంద్రాలు మూతపడిపోతున్నాయి. నగదు కొరతకుతోడు నిర్వహణా భారాన్ని తగ్గించేందుకు ఆయా బ్యాంకులు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాలు మూసివేస్తున్నాయి. గడిచిన రెండేళ్ళకాలంలో ఇప్పటివరకు 597 ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. 
 
ఏటీఎం కేంద్రాలు మూతపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు జమ చేసే నగదు కంటే.. ఏటీఎం కేంద్రాల ద్వారా విత్‌డ్రా చేసే డబ్బు అధికంగా ఉంది. ఫలితంగా ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికితోడు కొన్ని బ్యాంకులు నిర్వహణాభారాన్ని తగ్గించుకునేందుకు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి. 
 
గత 2017లో దేశవ్యాప్తంగా 2,22,300 ఏటీఎం కేంద్రాలు ఉండగా, 2019 నాటికి వీటి సంఖ్య 2,21,703కు పడిపోయింది. నిజానికి 2012 తర్వాత బ్యాంకు ఏటీఎంలు విస్తరణ రేటును పెంచాయి. అప్పట్లో ప్రతి 10,832 మందికి ఒక ఏటీఎం అందుబాటులో ఉంటే 2017 నాటికి ప్రతీ 5,919 మంది ఖాతాదారులకు ఒక ఏటీఎం చొప్పున అందుబాటులోకి వచ్చింది. కానీ, ఐదేళ్ల కాలంలో ఏటీఎం కేంద్రాలు మూతపడటం విచిత్రంగా ఉందని భారత రిజర్వు బ్యాంకు పేర్కొంది. నిజానికి బ్యాంకు యాజమాన్యాలు ఏటీఎంల సంఖ్య పెంచాలని భావించగా, దేశ వ్యాప్తంగా ఇవి తగ్గిపోవడం విచిత్రంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments