Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో నూతన బ్లూ స్క్వేర్‌ ప్రీమియం ఔట్‌లెట్‌ తెరిచిన యమహా

Webdunia
శనివారం, 30 జులై 2022 (23:28 IST)
భారతీయ మార్కెట్‌లో తమ కార్యకలాపాలను విస్తరించాలనే నిబద్ధతను మరింత బలోపేతం చేస్తూ ఇండియా యమహా మోటర్‌ (ఐవైఎం) ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు ఆంధ్రప్రదేశ్‌లోని  నెల్లూరులో తమ మొదటి బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. నెల్లూరులోని  వేదాయపాలెంలో ఉన్న బ్లూ స్క్వేర్‌  షోరూమ్‌ ‘గోల్డ్‌ ఫీల్డ్స్‌’ను సంపూర్ణమైన విక్రయాలు, విడిభాగాల మద్దతునందించే రీతిలో తీర్చిదిద్దారు. ఈ కాన్సెప్ట్‌ ఆధారిత షోరూమ్‌ 7400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా యమహా యొక్క రేసింగ్‌ డీఎన్‌ఏ ఉత్సాహం, శైలి, స్పోర్టీనెస్‌ను ప్రదర్శిస్తుంది.

 
ఈ సందర్భంగా యమహా మోటర్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ శ్రీ ఐషిన్‌ చిహానా మాట్లాడుతూ, ‘కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ బ్రాండ్‌ ప్రచారంలో భాగంగా నెల్లూరులో మా మొదటి బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్‌లో మా కార్యకలాపాలను విస్తరించేందుకు అత్యంత కీలకమైన మార్కెట్‌లలో ఒకటిగా ఇది నిలుస్తుంది. ఈ బ్లూ స్క్వేర్‌ షోరూమ్స్‌ ద్వారా ప్రతి వినియోగదారుడూ అంతర్జాతీయ మోటర్‌స్పోర్ట్స్‌లో యమహా యొక్క మహోన్నత వారసత్వాన్ని కలిగి ఉన్నాడనే భావన కలుగుతుంది. ఈ ప్రీమియం ఔట్‌లెట్లు మా వినియోగదారులు బ్రాండ్‌తో ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశం కల్పించడంతో పాటుగా ఉత్పత్తి సమాచారం సైతం పొందేందుకు తోడ్పడుతుంది. ఇక్కడ విస్తృత శ్రేణి యమహా యాక్ససరీలు, అప్పెరల్స్‌ పరిశీలించడంతో పాటుగా వినూత్నమైన యాజమాన్య అనుభవాలను సైతం పొందవచ్చు’’ అని అన్నారు.

 
బ్లూ స్క్వేర్‌లో మాత్రమే విక్రయించే ఏరోక్స్‌ 155తో పాటుగా ఈ ప్రీమియం ఔట్‌లెట్‌లో  ఇతర యమహా మోటర్‌సైకిల్స్‌, స్కూటర్స్‌, అసలైన యాక్ససరీలు, అప్పెరల్స్‌, విడిభాగాలు లభిస్తాయి. అంతేకాదు బ్లూ స్ట్రీక్స్‌ రైడర్‌ కమ్యూనిటీలో భాగమయ్యే అవకాశం కూడా వినియోగదారులకు ఈ షోరూమ్‌ కల్పిస్తుంది. ఈ నూతన ఔట్‌లెట్‌ ప్రారంభంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రీమియం బ్లూ స్క్వేర్‌ షోరూమ్స్‌ నిర్వహిస్తున్నట్లయింది. భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం 74 ఔట్‌లెట్లను యమహా నిర్వహిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments