Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీ కొత్త రికార్డు.. 100 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లు ఇట్టే అమ్ముడుబోయాయ్..

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:50 IST)
మొబైళ్ల తయారీ సంస్థ జియోమీ కొత్త రికార్డు సృష్టించింది. చైనాకు చెందిన ఈ సంస్థ సరికొత్త ఫీచర్లతో బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లను తీసుకురావడంతో.. తక్కువ కాలంలోనే అత్యధిక వినియోగదారులను సొంతం చేసుకుంది. 
 
ముఖ్యంగా భారత్‌లో మొబైల్ ఫోన్ల అమ్మకాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ 100 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్లు జియోమీ వెల్లడించింది. దీంతో ఇతర చైనా కంపెనీలైన ఒప్పో, వీవోలను వెనక్కి నెట్టింది.
 
ఇంకా వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో అత్యధిక స్మార్ట్‌ఫోన్లు విక్రయించిన సంస్థల జాబితాలో జియోమీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఈ రికార్డును ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థ సాధించకపోవడం విశేషం.
 
అంతర్జాతీయంగా ఏ దేశంలోనూ, మార్కెట్‌లోనూ ఐదేళ్ల కాలంలో ఒక స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ 100 మిలియన్‌ ఫోన్లను విక్రయించిన రికార్డు లేదు. ఇది తమ సంస్థకు ఓ మైలురాయి అని షమీ ఇండియా ఉపాధ్యక్షుడు మనుకుమార్‌ జైన్‌ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments