Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపద పంపిణీ జరగాలంటే సంపద సృష్టి కావాల్సిందే: ముఖేష్ అంబానీ

ప్రపంచీకరణ సంపన్నులను మరింత సంపన్నులుగా మార్చివేస్తోందని ఆందోళనలు రేగుతున్నప్పటికీ రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరొకలా అలోచిస్తున్నారు. ఫ్రీమార్కెట్‌కి తానిప్పటికీ అనుకూలుడినే అంటున్న ముఖేష్ సంపద పంపిణీకి సంపద సృష్టి అనేది ముందుషరతు కాబ

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (04:35 IST)
ప్రపంచీకరణ సంపన్నులను మరింత సంపన్నులుగా మార్చివేస్తోందని ఆందోళనలు రేగుతున్నప్పటికీ రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరొకలా అలోచిస్తున్నారు. ఫ్రీమార్కెట్‌కి తానిప్పటికీ అనుకూలుడినే అంటున్న ముఖేష్ సంపద పంపిణీకి సంపద సృష్టి అనేది ముందుషరతు కాబట్టి సంపద సృష్టికి అడ్డంకులు సృష్టించవద్దని స్పష్టం చేశారు. 
 
దావోస్ ఆర్థిక సదస్సులో ప్రసంగించిన ముఖేష్ నాలుగవ పారిశ్రామిక విప్లవానికి, సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రత్యేకించి ఇటీవలి పెద్దనోట్ల రద్దుతో తన విజయగాధను నిరూపించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వంటి దృఢమైన నేత కారణంగా భారత్ డిజిటల్ చెల్లింపుల్లో ముందడుగు వేస్తోందని ముఖేష్ కొనియాడారు. 

నూతన సాంకేతిక అంతరాయాలకు భారత్ సిద్ధంగా ఉందని పెద్ద నోట్ల రద్దు రుజువు చేసిందని, ముఖేష్ చెప్పారు. మానవజాతి ఎలా పురోగమిస్తోందన్నది అందరూ చూడాలని, ప్రధాని వంటి శక్తిమంతుడైన నేత నేతృత్వంలో యువభారత్ విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటుందని, భారతీయులకు టెక్నాలజీనే ఇప్పుడు ముందున్న అత్యత్తమ మార్గంలా కనిపిస్తుందని అంబానీ చెప్పారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments