Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియాలో విస్తారా విలీనం..

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (20:05 IST)
ఎయిరిండియా సంస్థ బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగనుంది. ఎయిరిండియాలో విస్తారా ఎయిర్‌లైన్స్ విలీనం కానుంది. ఇందుకు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ అంగీకారం తెలిపాయి. ఈ విలీన ప్రక్రియను 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని గడువును నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. 
 
టాటాతో జాయింట్ వెంచర్‌లో వున్న విస్తారాలో మైనారిటీ వాటాను కలిగి ఉన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్, విస్తరించిన ఎయిర్ ఇండియాలో దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉంటుంది. ఇది రూ. 2వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది.
 
ప్రస్తుతం, విస్తారాలో 51 శాతం వాటా టాటా వద్ద ఉండగా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ 2013లో ఏర్పాటు చేసిన జాయిన్ వెంచర్‌లో మిగిలిన 49 శాతాన్ని కలిగి ఉంది. ఇది విమానాల సంఖ్యను 218కి పెంచుతుంది. 
 
ఎయిర్ ఇండియా ప్రస్తుతం 113 విమానాలను, ఎయిర్ ఏషియా ఇండియా 28, విస్తారా 53, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 24తో కలిపి విమానాల సంఖ్య ఈ డీల్ ద్వారా పెరుగుతుంది. తద్వారా భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్, రెండవ అతిపెద్ద దేశీయ క్యారియర్‌గా ఎయిరిండియా మారుతుందని టాటా సన్స్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments