వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి రూ.9,900 కోట్లు ... ఖాతాపై ఎన్.పి.ఏ నిషేధం

ఠాగూర్
ఆదివారం, 19 మే 2024 (11:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదోహీ జిల్లాలో ఓ విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఖాతాలోకి ఉన్నఫళంగా రూ.9900 కోట్లు వచ్చిపడ్డాయి. అకస్మాత్తుగా తన ఖాతాలో భారీ మొత్తం కనిపించడంతో ఓ వ్యక్తి దిమ్మెరపోయాడు. ఈ జిల్లాకు చెందిన భానుప్రకాశ్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రిడెట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. అయితే, బ్యాంకు దృష్టిలో ఈ అకౌంట్ ఎన్పీఏగా (నిరర్థక ఆస్తి) మారింది. 
 
ఈ క్రమంలో తలెత్తిన సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అతడి ఖాతాలోకి ఒక్కసారిగా రూ. 99,99,94,95,999.99 దర్శనమిచ్చాయి. దీంతో, షాకైన భాను ప్రకాశ్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బ్యాంకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
 
సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఖాతాలోకి అంత మొత్తం కనిపించిందని భాను ప్రకాశకు మేము వివరించాం. పొరపాటు సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నాం. అకౌంట్ దుర్వినియోగం కాకుండా ముందుజాగ్రత్త చర్యగా దాన్ని హోల్డ్‌లో పెట్టాం' అని బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ తెలిపారు.
 
'ఎన్పీఏలకు సంబంధించిన అకౌంట్లపై కొన్ని పరిమితలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ అకౌంట్లతో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఫ్రీజ్ చేస్తాం. భాన్ ప్రకాశ్ తన అకౌంట్ చెక్ చేసినప్పుడు అది ఎన్పీఏ ఆంక్షల కారణంగా నెగెటివ్ కనిపించింది. పరిస్థితిని అతడికి వివరించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం" అని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం