Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూకేలోనే నీరవ్ మోదీ... విజయ్ మాల్యా కూడా లండన్‌లోనే

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ యూకేలో వున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని యూకే అధికారులు కూడా ధ్రువీకరించినట్లు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. దీంతో అతన్ని తిరిగి భారత్‌కు పంపించాలని కోరుతూ సీబీఐ అధి

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (19:00 IST)
ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ యూకేలో వున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని యూకే అధికారులు కూడా ధ్రువీకరించినట్లు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. దీంతో అతన్ని తిరిగి భారత్‌కు పంపించాలని కోరుతూ సీబీఐ అధికారులు యూకేను కోరారు. పంజాబ్ నేషనల్‌ బ్యాంకును వేల కోట్ల రూపాయలకు మోసగించి నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. 
 
దాదాపు రూ.13వేల కోట్ల మోసాలకు నీరవ్ పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం బయటపడడానికి కొద్ది రోజుల ముందే ఈ ఏడాది జనవరిలో వీరు దేశం విడిచి పారిపోయారు. అప్పటినుంచి వారిని భారత్‌ రప్పించాలని ఇక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 
 
కానీ నీరవ్ ఎక్కడ ఉన్నాడనే విషయంలో ఇన్ని రోజులు స్పష్టత రాలేదు. తాజాగా యూకే అధికారులే ధ్రువీకరించడంతో నీరవ్‌ యూకేలో ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరిలో నీరవ్‌, ఛోక్సీల పాస్‌పోర్ట్‌లను భారత్‌ రద్దు చేసింది. అయినప్పటికీ నీరవ్‌ వివిధ దేశాలకు వెళ్తూనే ఉన్నారు. 2002 నుంచి భారత ప్రభుత్వం 29 మంది పారిపోయిన నేరగాళ్లను స్వదేశానికి పంపించాల్సిందిగా యూకేను కోరింది. 
 
ఇందులో నీరవ్‌ 29వ వ్యక్తి. అయితే గత పదహారేళ్లలో యూకే 9 సార్లు భారత అభ్యర్థనను తిరస్కరించింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు చెల్లించకుండా పారిపోయిన మరో వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా కూడా లండన్‌లోనే ఉన్నాడు. మాల్యాను భారత్‌కు తిరిగి పంపించాలని మన ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై అక్కడి కోర్టులో కేసు ఇంకా నడుస్తూనే ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments