ఇకపై 24 గంటలు, 365 రోజులు నెఫ్ట్.. ఆర్బీఐ శుభవార్త

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (14:34 IST)
దేశంలో నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ లావాదేవీలు, నగదు బదిలీలో క్రమంగా పెరిగాయి. గతంలో బ్యాంకులకు వెళ్లి డబ్బులు వేసే వాళ్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీలు ఎక్కువగా చేస్తున్నారు.

ఇక బ్యాంకులు కూడా వాటికి భద్రత విషయంలో అనేక జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఎక్కువగా బ్యాంకింగ్ వినియోగదారులు వాటిపై మొగ్గు చూపిస్తున్నారు.
  
ఈ నేపథ్యంలో వారికి భారతీయ రిజర్వ్ బ్యాంకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా నగదు ఏ సమయంలో అయినా సరే బదిలీ చేసుకునే సదుపాయం కల్పించింది. 
 
ఇకపై సోమవారం నుంచి నెఫ్ట్ సేవలు 24 గంటలూ, 365 రోజులూ నిరంతరాయంగా ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం 6.30 గంటల వరకే నెఫ్ట్ నుంచి నగదు బదిలి అవకాశం ఉండేది.
 
దీనితో వినియోగదారులు ఎక్కువగా గూగుల్, ఫోన్ పే మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంకు… సమయపరిమితి విధానంకి గుడ్ బై చెప్పింది. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో సైతం ఇక నెఫ్ట్ చేసుకునే సదుపాయం కల్పించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments