Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్ షాకింగ్ న్యూస్ : పరుగులు పెడుతున్న పసిడి ధరలు...

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (10:31 IST)
దేశంలో కరోనా కష్టకాలంలోనూ బంగారం ధరల పెరుగుదలకు ఏమాత్రం అడ్డుకట్టపడటం లేదు. వీటి ధరలు రోజురోజకూ పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల కిందట కింది చూపులు చూసిన బంగారం.. ఇప్పుడు పై చూపులు చూస్తోంది. రోజురోజుకు ఆగకుండా పరుగులు పెడుతోంది. 
 
తాజాగా దేశీయంగా పరిశీలిస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అంటే 10 గ్రాములపై 100 రూపాయలు పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో నిలకడగా ఉంది. తాజాగా శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790 వద్ద ఉంది. 
 
ఇకపోతే, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద ఉంది.
 
ఈ ధరల పెరుగుదలపై ఆర్థిక నిపుణులు స్పందిస్తూ, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments