Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రీమ్‌ఫార్మ్ ప్రారంభంతో ఇ-కామర్స్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసిన థిన్‌ కిచెన్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (22:12 IST)
గ్లోబల్, ప్రీమియం కిచెన్, హోమ్‌వేర్ బ్రాండ్‌లను అందించే భారతదేశపు ప్రముఖ ఓమ్నిఛానల్ రిటైలర్ థిన్‌కిచెన్ ఈరోజు తమ ప్రిపరేషన్, కుకింగ్- సర్వింగ్ యాక్సెసరీస్ పోర్ట్‌ఫోలియోకు డ్రీమ్‌ఫార్మ్‌‌తో అద్భుతమైన జోడింపును చేసినట్లు ప్రకటించింది. 2003లో స్థాపించబడిన డ్రీమ్‌ఫార్మ్ అనేది అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియన్ ఉత్పత్తి డిజైన్ కంపెనీ. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అత్యంత సృజనాత్మక వంటసామాను-గృహోపకరణాలను తయారుచేస్తుంది. డ్రీమ్‌ఫార్మ్ మనం వంట చేసే విధానాన్ని మార్చడానికి తీర్చిదిద్దబడిన చమత్కారమైన గాడ్జెట్.
 
డ్రీమ్‌ఫార్మ్ 8 రెడ్ డాట్ డిజైన్ అవార్డ్, గుడ్ డిజైన్ అవార్డు, గ్లోబల్ ఇన్నోవేషన్ అవార్డ్స్‌తో సహా 34 ప్రముఖ అంతర్జాతీయ డిజైన్ అవార్డులను గెలుచుకుంది. అవార్డ్ విన్నింగ్ డిజైన్ అనేది యాదృశ్చికంగా జరిగేది కాదని డ్రీమ్‌ఫార్మ్ నమ్ముతుంది. ఈ కొత్త ప్రారంభంతో, థిన్‌కిచెన్ తమ పోర్ట్‌ఫోలియోలో 30 కంటే ఎక్కువ గ్లోబల్ బ్రాండ్‌లను కలిగి ఉంది, ప్రీమియం, అవార్డు గెలుచుకున్న ప్రిప్‌వేర్, కుక్‌వేర్, బేక్‌వేర్, టేబుల్‌వేర్, డైన్‌వేర్, బార్‌వేర్, స్టోరేజ్- హోమ్‌వేర్‌ల యొక్క చక్కటి సేకరణ వరకు ఉన్నాయి.
 
థిన్‌కిచెన్ సీఈఓ ఆనంద్ బల్దావా మాట్లాడుతూ, “థిన్‌కిచెన్ కుటుంబానికి డ్రీమ్‌ఫార్మ్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆలోచనాత్మకమైన డిజైన్- ప్రాక్టికాలిటీ పట్ల డ్రీమ్‌ఫార్మ్ యొక్క నిబద్ధత, మా కస్టమర్‌లకు అత్యుత్తమ-తరగతి కిచెన్‌వేర్‌ను అందించాలనే మా దృష్టితో సంపూర్ణంగా సరిపోలుతుంది. డ్రీమ్‌ఫార్మ్ జోడింపుతో, మా భారతీయ వినియోగదారులు మరింత విస్తృతమైన, అసాధారణమైన కిచెన్ టూల్స్‌‌ను పొందగలరు" అని అన్నారు
 
డ్రీమ్‌ఫార్మ్‌ ఇంటర్నేషనల్ సేల్స్ డైరెక్టర్ షాన్ ఓ మీరా మాట్లాడుతూ, “తిన్‌కిచెన్‌తో భాగస్వామ్యం కావడం, డ్రీమ్‌ఫార్మ్ యొక్క వినూత్న కిచెన్‌వేర్ సొల్యూషన్‌లను భారతీయ గృహాలకు అందించడం మాకు సంతోషంగా ఉంది. డ్రీమ్‌ఫార్మ్‌లో, రోజువారీ వంట పనులను సులభతరం చేయడానికి, మరింత సమర్థవంతంగా చేయడాన్ని మేము విశ్వసిస్తున్నాము." అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments