Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్ లగ్జరీ రైలులో హెడ్ ఫోన్లు మాయం.. ప్రయాణీకుల చేతివాటం.. ఛీ.. ఛీ.. ఇదేంపని?

ముంబై-గోవాల మధ్య ప్రారంభమైన భారతదేశపు తొలి లగ్జరీ రైలు తేజస్‌లో ప్రయాణీకుల చేతివాటంపై జాతీయ మీడియా ఏకిపారేసింది. ఎన్నో అత్యాధునిక సౌకర్యాలున్న ఈ రైలులో ప్రయాణీకులు వీక్షించేందుకు ప్రతి సీటు వెనుక భాగం

Webdunia
గురువారం, 25 మే 2017 (15:26 IST)
ముంబై-గోవాల మధ్య ప్రారంభమైన భారతదేశపు తొలి లగ్జరీ రైలు తేజస్‌లో ప్రయాణీకుల చేతివాటంపై జాతీయ మీడియా ఏకిపారేసింది. ఎన్నో అత్యాధునిక సౌకర్యాలున్న ఈ రైలులో ప్రయాణీకులు వీక్షించేందుకు ప్రతి సీటు వెనుక భాగంలో ఎల్‌సీడీ స్క్రీన్లు, హెడ్‌ ఫోన్లను అమర్చారు. అయితే, సర్వీసును ప్రారంభించిన మూడు రోజుల్లోనే ప్రయాణీకులు హెడ్ ఫోన్లు నొక్కేశారు. 
 
మొత్తం రైలులో 20 బోగీలు ఉన్నాయి. వీటిలో కొన్ని బోగీల్లో ఎల్‌సీడీ స్క్రీన్లు పగలిపోయాయని ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. రైలు ప్రవేశపెట్టిన మూడు రోజుల్లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై రైల్వే అధికారులు షాక్ అయ్యారు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తొలి రైలు తేజస్‌‌లో ప్రయాణించిన వారికి సామాజిక స్పృహ లేదని.. ఇలా ప్రవర్తించడం సిగ్గు చేటు అంటూ జాతీయ మీడియా ఏకిపారేసింది. 
 
200 కి.మీ వేగంతో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అనేక ఫీచర్లున్నాయి. ఆటోమేటిక్ డోర్స్,  9-ఇంచ్‌ల స్క్రీన్లు, టీ-కాఫీ వెండింగ్ మెషీన్లు, బయో-టాయిలెట్స్, టచ్ -ఫ్రీ వాటర్ టాప్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 12 హై-క్వాలిటీ హెడ్ ఫోన్స్ మాయం కావడంతో పాటు కొన్ని స్క్రీన్లు స్క్రాచ్ అయ్యాయని జాతీయ మీడియా తెలిపింి

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments