Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువు పెంపు...

ఠాగూర్
మంగళవారం, 27 మే 2025 (18:38 IST)
ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించిన ఆదాయపన్ను శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ గడువు 2025 జూలై 31వ తేదీ ముగియాల్సి ఉండగా ఇపుడు దానిని సెప్టెంబరు 15 వరకు పొడగించింది. 
 
ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్‌ను జారీచేయడంలో కొంత జాప్యం జరగడం ఈ గడువు పొడగింపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ విషయంపై ఆదాయపన్ను శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. 
 
"2025-26 మదింపు సంవత్సరానికి నోటిఫై చేసిన ఐటీఆర్ ఫారాల్లో చేపట్టిన మార్పులకు అనుగుణంగా సిస్టమ్‌ను సిద్ధం చేయడానికి కొంత సమయం అవసరం. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రిటర్నులు ఫైల్ చేసేందుకు వీలుగా జూలై 31వ తేదీతో ముగియనున్న గడువును  సెప్టెంబరు 15వ తేదీ వరకు పొడగిస్తున్నాం" అని ఆ ప్రకటనలో ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments