తత్కాల్ టైమింగ్స్ మారింది... రూటు మారితే రిఫండ్

రైలు ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి. ప్రస్తుతం అమల్లో ఉన్న తత్కాల్ టైమింగ్స్ మారాయి. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. తత్కాల్ విధానం కింద టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో మార్పులు చేర

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (08:58 IST)
రైలు ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి. ప్రస్తుతం అమల్లో ఉన్న తత్కాల్ టైమింగ్స్ మారాయి. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. తత్కాల్ విధానం కింద టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో మార్పులు చేర్పులు చేశారు. 
 
ఆ ప్రకారంగా, ఏసీ తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్‌-ఏసీ టికెట్ల బుకింగ్‌ 11 గంటలకు ప్రారంభిస్తారు. తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక.. రైలు 3 గంటలు అంతకుమించి ఆలస్యమైతే చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరే అవకాశం కల్పించారు.
 
ఒక మార్గంలో వెళ్లే రైలుకు తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక.. ఆ రైలు రూటును మార్చినా, తాము ఎక్కాల్సిన స్టేషన్‌ - దిగాల్సిన స్టేషన్‌ లేదా రెండూ ఆ మార్గంలో లేకపోయినా.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరవచ్చు.
 
బుక్‌ చేసుకున్న క్లాసులో కాకుండా దిగువ తరగతి శ్రేణిలో ప్రయాణించాలని రైల్వే వర్గాలు కోరితే.. ఇష్టం లేని ప్రయాణికులు పూర్తి రిఫండ్‌ కోరవచ్చు. ప్రయాణికులు అందుకు అంగీకరిస్తే.. చార్జీల మధ్య తేడాను ప్రయాణికులకు రైల్వే చెల్లిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments