Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియాకు కొత్త బాస్ - రతన్ టాటా వెల్లడి

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (09:27 IST)
ఇటీవల ఎయిర్ ఇండియా సంస్థకు టాటా గ్రూపు సొంతం చేసుకుంది. అయితే, ఈ గ్రూపు ఛైర్మన్‌కు ఎన్.చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. ఆయన పేరును రతన్ టాటా ప్రకటించారు. టాటా సన్స్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఎన్. చంద్రశేఖరన్ ఇకపై ఎయిర్ ఇండియా బాస్‌గా కూడా కొనసాగుతారు. నిజానికి ఎయిర్ ఇండియా బాస్‌గా ఇల్కర్ ఐసిని నియమించాలని భావించారు. కానీ, ఆయన వెనక్కి తగ్గడంతో ఎన్.చంద్రశేఖరన్ పేరును తెరపైకి తెచ్చారు. 
 
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థగా ఉన్న ఎయిరిండియాను టాటా గ్రూపు గత జనవరి నెలలో సొంతం చేసుకుంది. ఆ తర్వాత టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఈవో ఇల్కర్ ఐసిని ఎయిర్ ఇండియా సీవీవోగా నియమించారు. అయితే, ఆయన నియామకంపై విమర్శలు చెలరేగాయి. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టకుండానే రాజీనామా చేశారు. 
 
ఈ నేపథ్యంలో టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉన్న చంద్రశేఖరన్‌ను ఎయిర్ ఇండియా కొత్త ఛైర్మన్‌గా నియమిస్తూ టాటా గ్రూపు ప్రకటన చేసింది. కాగా, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో భాగంగా జరిగిన బిడ్డింగ్‌లో టాటా సన్స్ అనుబంధ సంస్థగా టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.18 వేల కోట్లకు ఎయిరిండియాను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. దీంతో 69 యేళ్ల తర్వాత ఎయిర్ ఇండియా తన పుట్టినిల్లు అయిన టాటా గ్రూపు చేతికి చేరింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments