Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా గ్రూప్ ఛైర్మన్ టీసీఎస్ సీఈఓ ఎన్.చంద్రశేఖరన్

టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత ఆ స్థానంలో నూతన ఛైర్మన్‌ను ఎన్నుకునే పనిలో పడింది టాటా గ్రూప్. కమిటీ పరిశీలనలో టీసీఎస్ సీఈవో ఎన్.చంద్రశేఖరన్, జాగ్వార్ లాండ్ రోవర్ అధిన

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (10:37 IST)
టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత ఆ స్థానంలో నూతన ఛైర్మన్‌ను ఎన్నుకునే పనిలో పడింది టాటా గ్రూప్. కమిటీ పరిశీలనలో టీసీఎస్ సీఈవో ఎన్.చంద్రశేఖరన్, జాగ్వార్ లాండ్ రోవర్ అధినేత రాల్ఫ్ స్పెత్, ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్ నోయల్ టాటా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరికల్లా కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయనున్నామని కమిటీ తెలిపింది.
 
ఇదిలావుండగా, టాటా గ్రూప్‌లో చోటుచేసుకున్న ఆకస్మిక పరిణామాలతో స్టేక్‌ హోల్డర్లంతా తీవ్ర ఆయోమయంలో ఉన్నారనీ, అందువల్ల టాటా గ్రూప్‌ ఈ పరిణామాలపై మరింత స్పష్టత ఇవ్వాలని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ఇండియా (ఐఐఎఎస్‌) సూచించింది. టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని బోర్డు అర్థంతరంగా తొలగించడం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 
 
దరిమిలా రతన్‌ టాటాపైనా, కొందరు బోర్డు సభ్యులపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ టాటా సన్స్‌ బోర్డుకు మిస్త్రీ ఒక లేఖ రాశారు. ఈ ఆరోపణలు తిప్పికొడుతూ టాటా గ్రూప్‌ కూడా స్పందించింది. అయితే, ఈ ఆకస్మిక పరిణామాలతో టాటా గ్రూప్‌ కంపెనీల షేర్‌ హోల్డర్లు, రుణాలిచ్చిన బ్యాంకులు, ఉద్యోగులు, ఇతర స్టేక్‌ హోల్డర్లలో తీవ్రమైన ఆయోమయం నెలకొని ఉందని ఐఐఎఎస్‌ పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments