పొదుపు ఖాతాల్లో కనీస నిల్వల పరిమితి కొందరికే..

పెద్దనోట్ల రద్దు కార్యక్రమం మొదలైనప్పటినుంచి ఖాతాదారులకు షాకులమీద షాకులిస్తున్న బ్యాంకులు తాజాగా పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేకుంటే పెనాల్టీ చార్జీలతో బాది పడేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కానీ ఈ సరికొత్త హెచ్చరికలతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (06:33 IST)
పెద్దనోట్ల రద్దు కార్యక్రమం మొదలైనప్పటినుంచి ఖాతాదారులకు షాకులమీద షాకులిస్తున్న బ్యాంకులు తాజాగా పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేకుంటే పెనాల్టీ చార్జీలతో బాది పడేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కానీ ఈ సరికొత్త హెచ్చరికలతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అసమ్మతి తెలుపుతున్న నేపథ్యంలో ఈ కనీస నిల్వల పరిమితి అందరికీ కాదని కొందరికే వర్తిస్తాయని బ్యాంకులు సడలింపు ప్రకటించాయి.
 
స్మాల్‌, బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా, కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజి, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన(పీఎంజేడీవై) కింద ఖాతాలు తెరిచిన వారికి కనీస నిల్వల నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త ప్రకటన చేసింది. కార్పొరేట్‌ శాలరీ అకౌంట్‌ ఖాతాదారులు ఇక నుంచి ఎటువంటి కనిష్ఠ నెలవారీ నిల్వలు ఉంచాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 
 
ఏప్రిల్ 1 నుంచి బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వలు తప్పనిసరిగా ఉంచాలంటూ ఎస్బీఐ, ఇతర బ్యాంకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం... మెట్రో నగరాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ రూ.5000. అర్బన్‌, సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల బ్యాంకు ఖాతాల్లో రూ.3000, రూ.2000, రూ.1000 కనీస నగదు నిల్వ ఉండాలి. 
 
ఇతర ఏటీఎంల నుంచి మూడు సార్లు కంటే ఎక్కువ నగదు విత్‌డ్రా చేస్తే రూ.20 ఛార్జీ వసూలు చేస్తారు. ఇక ఎస్‌బీఐలో ఏటీఎం నుంచి అయితే ఐదుసార్లు కన్నా ఎక్కువ విత్‌ డ్రా చేస్తే రూ.10ఛార్జి వసూలు చేయనున్నారు. మూడు నెలల కాలంలో రూ.25వేల నగదు వరకూ ఖాతాలో నిల్వ ఉంచిన వారి నుంచి ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ల నిమిత్తం రూ.15 వసూలు చేయనున్నారు. ఈ నిబంధనలను ఎస్‌బీఐ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments