Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేట్‌ ఫెస్టివల్‌ సేల్‌ : స్పైస్‌జెట్‌, జెట్‌ఎయిర్‌ పండగల ఆఫర్లు

దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రైవేట్ విమానయాన సంస్థలైన స్పైస్‌జెట్, జెట్‌ఎయిర్‌వేస్‌లు పండగ ఆఫర్లను ప్రకటించాయి. ఇందులోభాగంగా అతి తక్కువ ధరకే విమాన చార్జీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్‌ల

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (16:44 IST)
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రైవేట్ విమానయాన సంస్థలైన స్పైస్‌జెట్, జెట్‌ఎయిర్‌వేస్‌లు పండగ ఆఫర్లను ప్రకటించాయి. ఇందులోభాగంగా అతి తక్కువ ధరకే విమాన చార్జీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో టికెట్‌ ధరలు 396 రూపాయల నుంచి ప్రారంభంకానుండగా స్పైస్‌జెట్‌ టికెట్‌ ధరలు 888 రూపాయల నుంచి ప్రారంభంకానుంది. 
 
అలాగే, అంతర్జాతీయ రూట్లకు సంబంధించి టికెట్‌ ధరలు 3,699 రూపాయల నుంచి ప్రారంభమవుతాయని స్పైస్‌జెట్‌ తెలిపింది. గ్రేట్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఆఫర్‌లో భాగంగా ప్రయాణికులు ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు టికెట్లను బుక్‌చేసుకున్న ప్రయాణికులు నవంబర్‌ 8 నుంచి 2017 ఏప్రిల్‌ 13 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని స్పైస్‌ జెట్‌ తెలిపింది. 
 
ప్రధానంగా బెంగళూరు - కోచి, ఢిల్లీ- డెహ్రడూన్‌, చెన్నై- బెంగళూరు వంటి మార్గాల్లో 888 రూపాయల ఆఫర్‌ (ఆల్‌ ఇన్‌, వన్‌ వే) అందుబాటులో ఉండనుండగా చెన్నై-కొలంబో రూట్లలో 3,699 రూపాయల ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. కాగా స్పెషల్‌ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్లను ఈ నెల 4 నుంచి 7 వరకు అందుబాటులో ఉంటాయని జెట్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

కె.సీఆర్ స్పూర్తితో కేశవ చంద్ర రమావత్ సినిమా : హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments