Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టు ఆఫీసుల్లోనే ఇకపై పాస్ పోర్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..

పాస్ పోర్టుల కోసం వేలు వేలు వెచ్చిస్తున్నారా..? కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా? ఇక ఇలాంటి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఇక సులభంగా పాస్ పోర్టు పొందవచ్చు. ఎలాగంటే..? పోస్టు ఆఫీసుల్లోనే ఇకపై పాస్ పోర్ట

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (15:04 IST)
పాస్ పోర్టుల కోసం వేలు వేలు వెచ్చిస్తున్నారా..? కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా? ఇక ఇలాంటి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఇక సులభంగా పాస్ పోర్టు పొందవచ్చు. ఎలాగంటే..? పోస్టు ఆఫీసుల్లోనే ఇకపై పాస్ పోర్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. పాస్ పోర్టుల కోసం దరఖాస్తు చేసుకునే విషయంలో కొత్త మార్పులతో పాటు వినియోగదారులకు సులభంగా పాస్‌పోర్టులు లభించే విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే తపాలా శాఖ చర్యలు తీసుకుంటోంది. 
 
దీని ప్రకారం పోస్టాఫీసుల్లో పాస్ పోర్ట్ దరఖాస్తులను పొందవచ్చు. ఆపై కచ్చితమైన ఆధారాలతో పూర్తి చేసి సమర్పించి పాస్ పోర్ట్ పొందవచ్చు. ఈ విధానం తొలుత ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. అలాగే దేశ వ్యాప్తంగా ఈ పద్ధతిని అమలు పరిచేందుకు భారత విదేశాంగ శాఖతో చర్చలు జరుగుతున్నాయని తపాలా శాఖాధికారులు తెలిపారు. మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పుకొచ్చారు. పాస్ పోర్టులను అందజేసేటప్పుడు తపాలా శాఖ స్పీడ్ పోస్టు విధానాన్ని అమలు చేస్తుందని చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments