జూలై 1 నుంచి జీఎస్టీ అమలు.. స్మార్ట్ ఫోన్లు, సిమెంట్ ధరలు తగ్గుతాయట..
జీఎస్టీని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్లతో పాటు వైద్య పరికరాలు, సిమెంట్ ధరలు కూడా తగ్గుతాయని కేంద్రం ప్రకటించింది. దే
జీఎస్టీని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్లతో పాటు వైద్య పరికరాలు, సిమెంట్ ధరలు కూడా తగ్గుతాయని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లపై సగటున 13.5 శాతం పన్ను ఉండగా, జీఎస్టీ అమలైతే 12 శాతమే వసూలు చేస్తారని ఆర్థిక శాఖ వెల్లడించింది.
అంతేగాకుండా.. జీఎస్టీ అమలుతో వైద్య పరికరాలపై ప్రస్తుతమున్న 13 శాతం పన్నును 12 శాతంగా నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే సిమెంట్‌పై 31శాతం ఉన్న పన్నును 28 శాతానికి తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇదేవిధంగా బయో కెమికల్, ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి విధానంలో వాడే ముడిపదార్థాలపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.