Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోతున్న మనిషిని అమాంతం లేపిన సామ్‌సంగ్ ఫోన్

మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సామ్ సంగ్ కంపెనీకి ఇంకా కష్టాలు తీరినట్లు లేదు. గెలాక్సి 7 సీరీస్‌ స్మార్ట్‌ఫోన్లలో లోపాల వల్ల అవి విచ్చలవిడిగా కాలిపోతూ ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఆ దెబ్బతో కొన్ని లక్షల ఫోన్లను వెనక్కు తీసుకుని నష్ట

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (05:51 IST)
మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సామ్ సంగ్ కంపెనీకి ఇంకా కష్టాలు తీరినట్లు లేదు. గెలాక్సి 7 సీరీస్‌ స్మార్ట్‌ఫోన్లలో లోపాల వల్ల అవి విచ్చలవిడిగా కాలిపోతూ ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఆ దెబ్బతో కొన్ని లక్షల ఫోన్లను వెనక్కు తీసుకుని నష్టం భరించిన సామ్ సంగ్ కొత్త ఫోన్ల సీరిస్‌తో ముందుకొచ్చింది. కానీ ఉన్నచోటనే కాలిపోయే గుణాన్ని సామ్ సంగ్ పోగొట్టుకోలేదనడానికి రుజువులు మరీ దొరుకుతున్నాయి. 
 
కెనడాలోని టొరొంటోలో మంగళ వారం ఒకవ్యక్తిని సామ్‌సంగ్ ఉన్నట్లుండి నిద్రలేపింది. అర్థరాత్రి నిద్రకు పోనుకున్న మేరియో జాకబ్ అనే  వ్యక్తి తన పక్కన చుర్రున కాలినట్లనిపించడంతో ఉలిక్కిపడి లేచాడు. తన పక్కన ఉన్న సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 5 ఫోన్ మండిపోతూ కనిపించడం అతడికి షాక్ తెప్పించింది. 
 
కాలినట్లనిపించగానే నేను బెడ్ మీంచి ఎగిరి దుమికాను. నా గర్ల్‌ఫ్రెండ్‌ను అలర్ట్ చేసాను. నా ముఖానికి దగ్గరగా వివరీతంగా మండుతున్న మంటలు కనపించడంతో గాభరాపడ్డాను. పోలీసులకు ఫోన్ చేద్దామనుకున్నా నావద్ద ఫోన్ అందుబాటులో లేదు అని మేరియో జాకబ్ చెప్పారు. 
 
వార్త విన్నవెంటనే సామ్ సంగ్ యధాప్రకారం కస్టమర్ల భద్రత మా లక్ష్యం అంటూ పాట పాడింది. జాకబ్ ను వెంటనే సంప్రదించామని ఫోన్ కండిషన్ పరిశీలించిన తర్వాతే ఏం జరిగిందనేది స్పష్టమవుతుందని సామ్ సంగ్ అధికార ప్రతినిధి చెప్పారు.
 
ఏదేమైనా సామ్ సంగ్ కష్టాలు తీరినట్లు లేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments