Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన పార్లమెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగమైన 910 మంది కార్పెంటర్లకు సర్టిఫికెట్లను అందించిన స్కిల్‌ ఇండియా

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (23:16 IST)
ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతీకగా ఇండియా ఇప్పుడు తమ నూతన పార్లమెంట్‌ భవనం పట్ల గర్విస్తుంది. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా కీర్తించబడుతున్న ప్రస్తుత భవనం త్వరలోనే 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. నూతన పార్లమెంట్‌ భవనాన్ని  మన సొంత ప్రజలు, సొంత కారిగార్లు(కార్మికులు) నిర్మిస్తున్నారు. ఈ కార్మికుల ప్రయత్నాలను గుర్తిస్తూ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్ధాపకత(ఎంఎస్‌డీఈ) నేతృత్వంలోని ఫర్నిచర్‌ అండ్‌ ఫిట్టింగ్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌సీ) , ఎన్‌డీఎంసీ జ్యురిస్‌డిక్షన్‌ మరియు నార్సి గ్రూప్‌ భాగస్వామ్యంతో  రికగ్నైజేషన్‌ ఆఫ్‌ ప్రయర్‌ లెర్నింగ్‌ (ఆర్‌పీఎల్‌) కింద 910 మంది కార్పెంటర్లకు శిక్షణ అందించడంతో పాటుగా సర్టిఫికెట్లను అందించింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా కార్పెంటర్ల నైపుణ్య శిక్షణను మెరుగుపరచడంతో పాటుగా భారతదేశపు అభివృద్ధి మరియు ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నూతన పార్లమెంట్‌ భవన మౌలిక సదుపాయాల సృష్టిలో వీరిని విలువైన ఆస్తిగా తీర్చిదిద్దుతుంది.
 
ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్‌ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ స్టేక్‌హోల్డర్లు పాల్గొన్నారు. వీరిలో నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత (ఎంఎస్‌డీఈ) మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ కెకె ద్వివేది; గృహ, నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఓహెచ్‌యుఏ) మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ శ్రీ దీపక్‌ అగర్వాల్‌; సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్ల్యుడీ), ఎన్‌పీబీ  శ్రీ అశ్విన్‌ మిట్టల్‌; నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎన్‌సీవీఈటీ) డైరెక్టర్‌ శ్రీ సుశీల్‌ అగర్వాల్‌; నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) మేనేజర్‌ స్ట్రాటజీ వివేక్‌ శర్మ పాల్గొన్నారు.
 
స్కిల్‌ ఇండియా యొక్క ప్రతిష్టాత్మక పధకం ప్రధాన్‌మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(పీఎంకెవీవై)లో భాగం రికగ్నైజేషన్‌ ఆఫ్‌ ప్రయర్‌ లెర్నింగ్‌ (ఆర్‌పీఎల్‌). వ్యక్తుల ప్రస్తుత నైపుణాలు, అనుభవాన్ని పరీక్షించేందుకు ప్రత్యేక ఎస్సెస్‌మెంట్‌ ప్రక్రియను వినియోగిస్తుంది. ఎంఎస్‌డీఈ పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. పలు ప్రభుత్వ ఏజెన్సీలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేందుకు వీటిని అందిస్తుంటుంది. మంత్రిత్వశాఖతో పాటుగా నార్సి గ్రూప్‌లు గతంలో పలు ఆర్‌పీఎల్‌ పథకాల ద్వారా 6వేల మంది కార్పెంటర్లకు శిక్షణ అందించాయి.
 
నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్ధాపకత (ఎంఎస్‌డీఈ) మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ కృష్ణ కుమార్‌ ద్వివేది మాట్లాడుతూ ‘‘భారతదేశపు మహోన్నత ప్రజాస్వామ్య వారసత్వానికి ప్రతీకగా పార్లమెంట్‌ భవనం నిలుస్తుంది. ఇది భారతదేశపు పరాక్రమం, గౌరవానికి నిదర్శనం. మన కార్పెంటర్లకు అత్యుత్తమ శిక్షణ, లాంఛనంగా సర్టిఫికేషన్‌ అందించడం ద్వారా తగిన సాధికారిత అందించడంలో నేటి వేడుక ఓ ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలుస్తుంది. ఈ శిక్షణ ద్వారా ఈ కార్పెంటర్లు దేశీయంగా మాత్రమే గాక అంతర్జాతీయ మార్కెట్‌లలో సైతం తమ సత్తా చాటగలరు. ఈ శిక్షణతో మన కార్పెంటర్లకు ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలను సృష్టించే సామర్థ్యం కలగడంతో పాటుగా పరిశ్రమ డిమాండ్స్‌ను సైతం తీర్చే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమాలు, దేశాభివృద్ధి మరియు ఎదుగుదలకు దోహదం చేసే  నైపుణ్యవంతులైన కార్మికులను తీర్చిదిద్దడానికి  ప్రభుత్వ కార్యక్రమాలను వెల్లడిస్తుంది’’ అని అన్నారు.
 
నర్సిగ్రూప్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ మరియు ఫర్నిచర్‌ అండ్‌ ఫిట్టింగ్స్‌ స్కిల్‌ కౌన్సిల్‌  ఛైర్మన్‌ శ్రీ నర్సి డీ కులారియా మాట్లాడుతూ, ‘‘ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడం మా కార్పెంటర్‌ కమ్యూనిటీకి అత్యంత గౌరవం. మా సామర్ధ్యం మేరకు, మా కార్మికులకు తగిన శిక్షణ అందించేందుకు  చర్యలను తీసుకోవడంతో పాటుగా వారికి తగిన భద్రతను సైతం అందించడం ద్వారా నూతన పార్లమెంట్‌ భవంతికి అత్యాధునిక వసతులు కల్పించేందుకు కృషి చేశాము. స్వయంగా కార్పెంటర్‌ను అయిన నేను, నైపుణ్యాభివృద్ధి మరియు సామర్ధ్యం మెరుగుపరుచుకోవడంలో సర్టిఫికేషన్‌ విలువను గుర్తించాను. అభ్యర్ధుల ప్రాధమిక నైపుణ్య శిక్షణను మెరుగుపరచడం కోసం, మేము పలు కార్యక్రమాలైనటువంటి మేరీ స్కిల్‌ మేరీ పెహ్‌చాన్‌, నేషనల్‌ అప్రెంటిషిప్‌ ప్రోమోషనల్‌ స్కీమ్‌ (ఎన్‌పీఏఎస్‌) చేపటడ్డంతో పాటుగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను సృష్టించాము. తద్వారా ఆర్ధిక వృద్ధిలో వారు సైతం చురుగ్గా పాల్గొనేందుకు తోడ్పడ్డాము. దీనితో రాబోయే కాలంలో భారతదేశ వ్యాప్తంగా  25వేల మంది కార్పెంటర్లకు తగిన నైపుణ్యాలను అందించడంతో పాటుగా సర్టిఫికేషన్‌లను అందించడానికి  కృషి చేయనున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments