Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణాలలో శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నెలకు 100 కోట్ల రూపాయల ఋణాలు లక్ష్యం

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (19:46 IST)
శ్రీరామ్‌ గ్రూప్‌లో భాగం కావడంతో పాటుగా శ్రీరామ్‌సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ (శ్రీరామ్‌ సిటీ) ప్రమోట్‌ చేస్తున్న, ముంబై కేంద్రంగా కలిగిన అందుబాటు ధరలోని గృహ ఋణ విభాగ కంపెనీ శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ తమ విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలపై పూర్తిగా దృష్టి సారించింది.
 
ఈ ప్రాంతాలలో నెలకు 100 కోట్ల రూపాయల ఋణ వితరణ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. దీనిలో భాగంగా 350 మందిని కొత్తగా ఉద్యోగాలలోకి తీసుకోవడానికి సైతం ప్రణాళిక చేసింది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాల(ఏపీటీజీ)లో శ్రీరామ్‌ సిటీ 178 శాఖలను 2021 సంవత్సరాంతానికి తెరువడానికి  ప్రణాళిక చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఏపీటీజీలో 11 సొంత శాఖలు ఉండటంతో పాటుగా 500 కోట్ల రూపాయల నిర్వహణలోని ఆస్తులు (ఏయుఎం)ను ఈ ప్రాంతంలో కలిగి ఉంది.
 
ఈ ప్రణాళికలను గురించి శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎండీ అండ్‌ సీఈవో రవి సుబ్రమణియన్‌ మాట్లాడుతూ, ‘‘అందుబాటు  ధరల్లోని గృహ ఋణ విభాగంలో శక్తివంతమైన వృద్ధి కనిపిస్తుంది. మా వ్యూహం ఇప్పుడు ప్రాంతీయ మార్కెట్‌లలో సైతం మా ఉనికిని బలోపేతం చేయడంపై ఉంది. ఏపీటీజీ తో దీనిని ఆరంభిస్తున్నాం. నిజానికి ఏపీటీజీలో సరిగా మార్కెట్‌ను సొంతం చేసుకోలేదు.
 
ఏపీటీజీలో తాము కార్యకలాపాలు ఆరంభించిన నాటి నుంచి 1400 కోట్ల రూపాయల ఋణాలను మాత్రమే అందించాం. కానీ ఇక్కడ ఉన్న మార్కెట్‌ సామర్థ్యం ఆధారంగా రాబోయే రెండేళ్లలో అతి పెద్ద హౌసింగ్‌ కంపెనీగా నిలువాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం. దీనికోసం ప్రాంతంలో శ్రీరామ్‌ సిటీ శాఖల నెట్‌వర్క్‌ శక్తిని వినియోగించుకోవాలనుకుంటున్నాం. మా రిటైల్‌ ఉనికిని మరింతగా విస్తరించడంతో పాటుగా నెలకు 100 కోట్ల రూపాయల ఋణ వితరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఋణాల రమారమి టిక్కెట్‌ సైజ్‌ 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయలలో ఉండనుంది’’అని అన్నారు.
 
గత రెండు సంవత్సరాలు కోవిడ్‌ కారణంగా ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందన్న రవి సుబ్రమణియన్‌, తొలి వేవ్‌ సమయంలో తీవ్రంగా తాము ప్రభావితమైనప్పటికీ, రెండో వేవ్‌ నాటికి సాధారణ స్థితికి రాగలిగామన్నారు. ఈ క్రమంలోనే నూతన మార్కెట్‌లకి విస్తరించడం, మా నియామకాలను పునరుద్ధరించడం పైన దృష్టి  సారించామన్నారు.
 
ఏపీటీజీలలో రాబోయే రెండేళ్లలో మొత్తంమ్మీద 2500 కోట్ల రూపాయల ఋణాలను అందించనున్నట్లు వెల్లడించిన ఆయన ఇక్కడ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఋణ మార్కెట్‌ నిష్పత్తి పురుషులతో స్త్రీలను పోల్చినప్పుడు 70:30 రేషియోలోనే ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments