Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎఫెక్టు : రూ.2.5 లక్షల కోట్లు ఆవిరి

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (17:23 IST)
వచ్చే యేడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ఫలితాలు వెల్లడయ్యేందుకు ఒక్క రోజు ముందు ఇన్వెస్టర్ల కొంపముంచాయి. సోమవారం ఒక్కరోజే బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 713.53 పాయింట్లను నష్టపోయింది. ఫలితంగా పెట్టుబడిదారుల సొమ్ము రూ.2.5 లక్షల కోట్లు ఆవిరైపోయింది. 
 
సోమవారం ట్రేడింగ్‌లో ఒకే రోజు రెండు శాతం నష్టపోయిన సెన్సెక్స్ 34,959 పాయింట్లకు చేరింది. అటు నిఫ్టీ కూడా 205 పాయింట్లు నష్టపోయి 10,488 పాయింట్ల దగ్గరకు వచ్చింది. బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, కాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ స్టాక్స్‌లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనికితోడు విదేశీ పెట్టుబడులు తరలిపోవడం కూడా సెన్సెక్స్ పతనానికి కారణంగా నిలిచింది. 
 
కాగా, మంగళవారం తెలంగాణ రాష్ట్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశ ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments