Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకులు.. ఆ సేవలు మాత్రమే..

Webdunia
గురువారం, 20 మే 2021 (14:14 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకు కరోనా కష్టకాలంలోనూ తమ ఖాతాదారులకు నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. అదేసమయంలో బ్యాంకుకు సంబంధించిన విషయాలు.. ఖాతాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా తమ కస్టమర్లకు తెలియజేస్తుంది. తాజాగా మరో విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయాన్ని చూస్తునే ఉన్నాం. కోవిడ్ కట్టడికి ఆయా రాష్ట్రాలు లాక్డౌన్ విధానాన్ని అమలు పరుస్తున్నాయి. దీంతో బ్యాంక్ వర్కింగ్ టైమింగ్స్ కూడా మారాయి. ఆయా రాష్ట్ర లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు తమ పని గంటలను కుదించుకున్నాయి.. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి బ్యాంక్ ఓపెనింగ్, క్లోజింగ్ టైమ్స్ మార్చేసింది. ఇక వర్కింగ్ టైంలో మాత్రమే పలు సేవలు అందుబాటులో ఉండనున్నట్లుగా ప్రకటించింది.
 
ఈ మేరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కస్టమర్లు అత్యవసర పనులు ఉంటేనే తమ సమీప బ్యాంకు బ్రాంచుకు వెళ్ళాలని సూచించింది. ఇకపై ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పనిచేస్తాయి. మే 31 వరకు ఇదే విధంగా పనిచేస్తాయి. అలాగే మధ్యాహ్నం 2 గంటల సమయంలో బ్యాంకులు క్లోజ్ అవుతాయి. 
 
అలాగే, బ్యాంకుకు వెళ్లేవారు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. లేదంటే ఎంట్రీ ఉండదనే విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సమయంలో బ్యాంకులో క్యాష్ డిపాజిట్, విత్ డ్రా, చెక్‌బుక్ సంబంధిత పనులు, డీడీ, నెఫ్ట్, ఆర్టీజీస్ పనులు, గవర్నమెంట్ చలాన్ వంటి పనులు మాత్రమే చేస్తారు. ఇతర చిన్నచిన్న పనులను మాత్రం తాత్కాలికంగా వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments