Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫారెక్స్ మార్కెట్‌లో #Rupee @80 - ఆల్‌టైమ్ కనిష్టం

Webdunia
సోమవారం, 18 జులై 2022 (17:24 IST)
అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ నానాటికీ దిగజారిపోతోంది. ముఖ్యంగా అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ మరింతగా క్షీణించిపోతోంది. ఫలితంగా సోమవారం డాల‌ర్‌పై రూపాయి మార‌కం విలువ ఆల్‌టైం కనిష్ట స్థాయికి ప‌త‌న‌మైంది. చ‌రిత్ర‌లో తొలిసారి 80కి చేరింది. 
 
సోమ‌వారం మార్కెట్ ముగింపు ద‌శ‌లో 15 పైస‌లు కోలుకుని 79.97 వ‌ద్ద స్థిర ప‌డింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతోపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్ట‌ర్లు నిరంత‌రం నిధుల ఉప‌సంహ‌ర‌ణ‌కు దిగ‌డంతో రూపాయి విలువ ప‌త‌నానికి ప్రధాన కారణంగా నిలిచింది. 
 
నిజానికి సోమవారం ట్రేడింగ్ ప్రారంభంకాగానే రూ.79.76 వ‌ద్ద మొద‌లై త‌ర్వాత రూపాయి విలువ ఆ తర్వాత మరింతగా బలహీనపడింది. డాల‌ర్‌పై ఒకానొక ద‌శ‌లో 80 పైస‌ల‌కు ప‌డిపోయింది. ఇది కొద్ది సేపు అలాగే కొన‌సాగింది. 
 
చివ‌ర‌కు ముగింపు ద‌శ‌లో 15 పైస‌ల ల‌బ్ధితో 79.76 వ‌ద్ద స్థిరపడింది. శుక్ర‌వారం 80 రూపాయల స‌మీపానికి ప‌డిపోయిన రూపాయి తిరిగి 17 పైస‌లు కోలుకుని 79.98 వ‌ద్ద నిలబడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్టీఆర్ "దేవర" చిత్రం ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఏంటి?

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ

రోటి కపడా రొమాన్స్‌ విజయం గురించి డౌట్‌ లేదు, అందుకే వాయిదా వేస్తున్నాం

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments