Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌ళ్లీ పెరిగిన‌ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

Rising
Webdunia
శుక్రవారం, 7 మే 2021 (18:41 IST)
దేశంలో మ‌ళ్లీ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. వ‌రుస‌గా నాలుగో రోజూ పెట్రో ధ‌ర‌ల‌ను పెంచుతూ దేశీయ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. 
 
దీంతో దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో లీట‌ర్‌ పెట్రోల్‌పై 25-28 పైస‌లు, డీజిల్‌పై 30-33 పైస‌ల వ‌ర‌కు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.91.27, డీజిల్‌ రూ.81.73కు చేరింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.97.61, డీజిల్‌ రూ.88.82, చెన్నైలో పెట్రోల్‌ రూ.93.15, డీజిల్‌ రూ.86.65, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.41, డీజిల్‌ రూ.84.57కు చేరాయి.
 
 బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.30, డీజిల్‌ రూ.86.64కు, హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.86, డీజిల్‌ రూ.89.11కు, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.65, డీజిల్‌ రూ.90.25గా ఉన్నాయి.
 
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధ‌మైన ప‌న్నులు విధిస్తుండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో సుమారు రెండు నెల‌ల‌పాటు దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. ఎన్నిక‌లు ముగియ‌డంతో గ‌త నాలుగు రోజులుగా ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి.  దీంతో ఢిల్లీలో నాలుగు రోజుల్లో పెట్రోల్ పై 82 పైస‌లు, డీజిల్‌పై రూ.1 పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments