Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియాలోనే రెండో అత్యంత ధనిక కుటుంబం ఏది?

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (08:48 IST)
దేశ పారిశ్రామికదిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరో రికార్డు సృష్టించారు. ఆసియాలోనే అత్యంత ధనిక కుటుంబంగా గుర్తింపు దక్కించుకుంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన వివరాల మేరకు.. ఆసియాలోని అందరికంటే అంబానీ కుటుంబం అత్యంత ధనిక కుటుంబంగా రికార్డులను నమోదు చేశారు. వీరి సంపద ఆసియాలోనే రెండో అత్యంత ధనిక కుటుంబంగా ఉన్న క్వాక్ కుటుంబ ఆస్తుల కంటే రెట్టింపులో ఉందని తెలిపింది. 
 
ముఖేశ్ అంబానీ కుటుంబ సంపద 76 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.5.62 లక్షల కోట్లు) ఉండగా, రెండో స్థానంలో ఉన్న క్వాక్ కుటుంబ సంపద 33 బిలియన్ డాలరు(రూ.2.44 లక్షల కోట్లు)గా ఉంది. 
 
ఈ జాబితాలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ అధినేత లీ కుటుంబం ఐదో స్థానంలో నిలిచింది. వీరి సంపద 26.6 బిలియన్ డాలర్లు(రూ.1.96 లక్షల కోట్లు)గా ఉంది. ముఖేష్ అంబానీ కుటుంబ సంపద లీ కుటుంబం సంపద కంటే మూడు రెట్లు అధికం కావడం గమనార్హం.
 
ఈ ఏడాది రిలయన్స్ సంస్థ జియోతో పాటు రిటైల్ విభాగంలో దూకుడు పెంచడం ద్వారా ముఖేశ్ కుటుంబ సంపద భారీగా పెరిగిందని బ్లూమ్‌బర్గ్ వ్యాఖ్యానించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో రిలయన్స్ జియో, రిటైల్ వెంచర్స్ ఆకట్టుకున్నాయని, తక్కువ వ్యవధిలో రిలయన్స్ షేర్ ధర ఏకంగా 50 శాతం ర్యాలీ చేసినట్టు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ కారణంగా ముఖేష్ అంబానీ కుటుంబ ఆస్తులు కూడా అమాంతం పెరిగినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments