Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మరింతగా వడ్డీరేట్లు తగ్గుతాయ్ : మోర్గాన్ స్టాన్లీ

Webdunia
ఆదివారం, 29 మే 2016 (15:16 IST)
భారత్‌లో మరింతగా వడ్డీరేట్లు తగ్గుతాయని ప్రముఖ రీసెర్స్ అండ్ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా భారత్‌లో మరో అర శాతం వరకూ వడ్డీ రేట్లు తగ్గవచ్చని అంచనా వేసింది. జూన్ ఏడో తేదీన భారత రిజర్వు బ్యాంకు తన ద్రవ్య పరపతి విధానాన్ని వెల్లడించనుంది. ఇందులో మాత్రం కీలక రేట్ల సవరణ ఉండకపోవచ్చని ఓ నివేదిక విడుదల చేసింది.
 
తదుపరి రుతుపవనాలపై ఆధారపడి రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు తీసుకోనుందని, ఈ సీజనులో అంచనాలకు తగ్గట్టు వర్షాలు పడితే, కీలక రేట్లు తగ్గించే వెసులుబాటు దగ్గరవుతుందని ఈ రిపోర్టు అంచనా వేసింది. వర్షాలు బాగుంటే ఆగస్టులో లేదా అక్టోబరులో వడ్డీ రేట్లు తగ్గవచ్చని తెలిపింది. కాగా, గత ఏప్రిల్ నెలలో రెపో రేటును పావు శాతం మేరకు తగ్గించిన విషయం తెల్సిందే 
 
దీంతో జనవరి 2015 నుంచి ఇప్పటి వరకూ ఒకటిన్నర శాతం మేరకు వడ్డీ రేట్లు తగ్గగా, ఆ మేరకు ప్రయోజనాలు మాత్రం ప్రజలకు దగ్గర కాలేదు. తమ మార్జిన్లు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో, ఆర్బీఐ నిర్ణయాలను అమలు చేయడంలో బ్యాంకులు విస్మరిస్తున్నాయి. ఫలితంగా ఆర్బీఐ తగ్గింపు ఫలితం దేశ ప్రజలకు చేరడం లేదు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments