Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రెడిట్ - డెబిట్ కార్డులకు ఇకపై నెట్‌వర్క్.. మీకు నచ్చిన కార్డును ఎంచుకోవచ్చు...

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (12:56 IST)
క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డుల విషయంలో కష్టమర్ తనకు నచ్చి విధంగా పేమెంట్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే వెసులుబాటును భారత రిజర్వు బ్యాంకు కల్పించింది. మాస్టర్ కార్డు నుంచి రూపే, రూపే కార్డు నుంచి మాస్టర్‌ కార్డుకు.. ఇలా నచ్చిన కార్డు నెట్‌వర్క్‌కు మారడానికి ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 
 
ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఈ సౌకర్యాన్ని అక్టోబర్ 1, 2023 నుండి అందుబాటులోకి తీసుకురావాలని కార్డు జారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇది అమల్లోకి వస్తే వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తదితర కార్డులలో కస్టమర్ తనకు నచ్చిన కార్డు నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు.
 
కార్డు జారీ సంస్థలు ఇప్పటి వరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీని ప్రకారం కస్టమర్ ఏ కార్డును వినియోగించాలన్నది సదరు కార్డు జారీ సంస్థదే నిర్ణయం. కానీ అక్టోబరు నుండి ఇది కస్టమర్ ఛాయిస్ కానుంది. ఒక కార్డు ఉన్న వారు మరో కార్డుకు మారవచ్చు. ప్రస్తుతం డ్రాఫ్ట్ పై ఆర్బీఐ అభిప్రాయాలు కోరుతోంది.
 
డ్రాఫ్ట్ ప్రకారం కార్డు జారీ చేసే వారు ఆయా సంస్థలతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని, కస్టమర్లు ఇతర నెట్ వర్క్ సేవలను పొందకుండా నిరోధించవద్దు. కార్డు జారీ చేసే సంస్థ ఒకటి కంటే ఎక్కువ ఫైనాన్షియల్ నెట్ వర్క్‌లతో సంబంధాలు పెట్టుకోవాలి. వాటికి సంబంధించిన కార్డులు జారీ చేయాలి. అర్హులైన కస్టమర్లకు కార్డును ఎంచుకునే వెసులుబాటును కల్పించాలి. ఎప్పుడైనా మరో కార్డుకు మారే అవకాశం ఇవ్వాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments