Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాను ట్యాక్స్ కంప్లియంట్ సొసైటీ మారుస్తాం : ప్రధాన మోడీ

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (18:20 IST)
మనదేశ జనాభా 130 కోట్లు. అందులో సింహ భాగం యువతే. కానీ, ఈ జనాభాలో పన్ను చెల్లించే వారి సంఖ్య కేవలం కోటిన్నర మంది మాత్రమే. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వెల్లడించారు. దేశం మరింతగా అభివృద్ధి చెందాలంటే ఈ పరిస్థితి మారాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదండోయ్... ప్రజలంతా నిజాయితీగా పన్నులు చెల్లిస్తామని వాగ్దానం చేయాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, '2022లో మనం 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ సందర్భాన్ని వేడుకగా చేసుకుందాం. ఇండియాను సరిగ్గా పన్నులు కట్టే, గౌరవించే దేశం (ట్యాక్స్ కంప్లియంట్ సొసైటీ)గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఆ దిశగా చాలా వర్క్ చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది' అని చెప్పుకొచ్చారు. 
 
పన్నులు కట్టే వాళ్లకు అధికారుల నుంచి వేధింపులు లేకుండా చేశామని మోడీ అన్నారు. పీపుల్స్ సెంట్రిక్ (ప్రజలే కేంద్రం)గా ఉండేలా విధానాలను ప్రవేశపెడుతున్నామన్నారు. ట్యాక్స్‌లకు సంబంధించి డిపార్ట్‌మెంట్లను పునర్వ్యవస్థీకరించామని, అవినీతికి చోటులేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments