నకిలీ సందేశంతో వల విసిరారు - బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లకు అలెర్ట్

ఠాగూర్
సోమవారం, 9 జూన్ 2025 (18:49 IST)
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు టార్గెట్ చేసేలా సైబర్ మోసగాళ్ళు ఓ నకిలీ సందేశంతో వల విసిరారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారిని తప్పుదారి పట్టించే సందేశాలను పంపి ఖాతాలను ఖాళీ చేసేందుకు కొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. 
 
తాజాగా బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్లను టార్గెట్‌ చేసేలా ఒక నకిలీ సందేశంతో వల విసిరారు. వినియోగదారుల కేవైసీ ట్రాయ్ నిలిపివేస్తుందని, 24 గంటల్లో సిమ్ కార్డు బ్లాక్ చేస్తారంటూ అసత్య సందేశాలు పంపి గందగగోళం సృష్టిస్తున్నారు. ఒక నంబర్ ఇచ్చి కాల్ చేయాలని పేర్కొన్నారు. 
 
అయితే, ఈ నకిలీ సందేశంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాంటి సందేశాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఇది ఫేక్ నోటీసు, బీఎస్ఎన్‌ఎల్ ఎపుడూ సిమ్ కేవైసీకి సంబంధించి ఎలాంటి నోటీసూ పంపించదు. 
 
ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండండి అని సూచించింది. ఏదైనా వార్తను నమ్మడం, వేరొకరికి షేర్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకోవాలని ప్రజలను సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments