Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు రోజుల విరామం.. మళ్లీ మొదలైన పెట్రో బాదుడు

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (10:21 IST)
రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ పెట్రో బాదుడు మొదలైంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధర, రెండు రోజులుగా తగ్గలేదు. ఈ క్రమంలో మంగళవారం నాడు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలుపై 36 పైసల వరకు, డీజిల్ పై 38 పైసల వరకూ ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఉదయం ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 90.93కు చేరగా, డీజిల్ ధర రూ. 81.32కు పెరిగింది.
 
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, లీటరు పెట్రోలు ధర రూ. 94.54కు డీజిల్ ధర రూ. 88.69కి చేరింది. బెంగళూరులో పెట్రోలు ధర రూ. 93.98కి, డీజిల్ ధర రూ. 86.21కి చేరింది. గడచిన 54 రోజుల్లో 25 సార్లు ధరలు పెరగడంపై ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. 
 
కాగా, పెట్రోల్ ధరల విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తుండటం గమనార్హం. తమ లాభాలను పెంచుకునేందుకు క్రూడాయిల్‌ను వెలికితీస్తున్న ఒపెక్ దేశాలు ప్రొడక్షన్ కోతను అమలు చేస్తున్నాయని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments