Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 25 రోజులుగా నిలకడగా చమురు ధరలు...

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (12:34 IST)
దేశంలో చమురు ధరలు నిలకడగా ఉన్నాయి. ముఖ్యంగా, ఇటీవల దేశ వ్యాప్తంగా వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత కూడా పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్ ధరల ప్రకారం కూడా ఈ చమురు ధరల్లో తేడా కనిపించలేదు. అంటే.. గత 25 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.103.97గాను, డీజిల్ ధర రూ.86.67గాను ఉంది. అలాగే, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.109.98, డీజిల్ ధర రూ.94.14 చొప్పున ఉంది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంలో రూ.108.20గా ఉంటే డీజిల్ ధర రూ.94.62గా వుంది. విజయవాడ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.110.50గా ఉంటే డీజిల్ ధర రూ.96.46గా ఉంది. కాగా, వచ్చేయేడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, పెట్రోల్ ధరలను వీలైనంత మేరకు స్థిరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments