Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయం నష్టపోని విధంగా జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ - డీజిల్

దేశంలో పెట్రో మంటపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రికార్డు స్థాయిలో ఈ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో "కర్ర విరగకుండా, పాము చావకుండా" అనే చందంగా పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని ర

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (09:09 IST)
దేశంలో పెట్రో మంటపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రికార్డు స్థాయిలో ఈ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో "కర్ర విరగకుండా, పాము చావకుండా" అనే చందంగా పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని కేంద్రం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
ముఖ్యంగా, తమ ఆదాయంతో పాటు పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలకు వచ్చే ఆదాయం నష్టపోని రీతిలో ఈ పని పూర్తి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. 
 
అదే జరిగితే తాము పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోవాల్సి ఉంటుందని భయపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానిదీ ఇదే పరిస్థితి. దీంతో ఎవరూ నష్టపోని విధంగా జీఎస్టీలోని గరిష్టంగా 28 శాతం శ్లాబులో చేర్చి, అదనంగా వ్యాట్‌ చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పెట్రోల్‌పై దాదాపు అన్ని దేశాలు జీఎస్టీతో పాటు ఇతర పన్నులూ వడ్డిస్తుండటంతో ఇదే సూత్రాన్ని అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments