Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగని పెట్రో బాదుడు... తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎంతంటే?

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (10:34 IST)
దేశంలో పెట్రోల్ ధరల బాదుడు ఆగడం లేదు. మరోమారు ఈ పెట్రోల్, డీజల్ చార్జీలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.11కు చేరగా.. డీజిల్‌ రూ.88.65కు పెరిగింది. 
 
మే 4వ తేదీ తర్వాత ఇంధన ధరలు పెరగడం ఇది 31వ సారి. ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.7.79, డీజిల్‌పై 7.87 వరకు చమరు కంపెనీలు పెంచాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.104 దాటింది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.10.22కు పెరగ్గా.. డీజిల్‌ రూ.96.16కు చేరింది. 
 
హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.102కు చేరువైంది. ప్రస్తుతం ధర రూ.101.96కు పెరిగింది. మరోవైపు అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 109.30 చేరగా.. డీజిల్‌ రూ.101.85కు చేరింది. 
 
ఇదిలావుంటే, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు డిమాండ్‌ పెరగ్గా.. మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం బ్రెంట్‌ ముడి ధర బ్యారెల్‌కు 76 డాలర్లు దాటింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బ్రెంట్‌ 0.62 డాలర్లు పెరిగి.. యూఎస్‌ మార్కెట్‌లో బ్యారెల్‌కు 76.18 డాలర్లకు చేరింది. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ 0.75 డాలర్లు పెరిగి.. బ్యారెల్‌కు 74.05 డాలర్లు పలికింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments