Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగని పెట్రోల్ బాదుడు.. సెంచరీని దాటే దిశగా పెట్రోల్

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (11:39 IST)
పెట్రోల్‌ బాదుడు ఆగడం లేదు. లీటర్‌ పెట్రోల్‌ సెంచరీని దాటే దిశగా దూసుకుపోతోంది. డీజిల్‌ ధరలు సైతం పెట్రోల్‌ ధరలతో పోటీపడి పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర సెంచరీకి చేరువైంది. తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు మేర రేటు పెరిగింది. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్‌ ధర 35 సార్లు పెరగగా, డీజిల్‌ 34 సార్లు ధర పెరగడం గమనార్హం. 
 
సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఒక లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.86 కు చేరుకోగా, డీజిల్‌ ధర రూ.89.36 వద్ద నిన్నటి ధరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ... పెట్రోల్‌ ధర 37 పైసల మేర పెరిగింది. 
 
హైదరాబాద్‌లో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.78కు చేరగా, డీజిల్‌ నిన్నటి ధర రూ.97.40గా ఉంది. హైదరాబాద్‌ కంటే జిల్లాలలో అధిక ధరలకు పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా పెట్రోల్‌ ధర రూ. 105.80, డీజిల్‌ ధర రూ.105.37గా ఉన్నాయి. ఇక విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.59 కాగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.99.01గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments