Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ కరెన్సీ పతనం - ఒక్క డాలర్ రూ.144

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (17:45 IST)
పాకిస్థాన్ కరెన్సీ విలువ రోజురోజుకూ పతనమైపోతోంది. శుక్రవారం అది మరింత పతనమైంది. ఒక్క రోజే జీవితకాల గరిష్టానికి చేరింది. ఫలితంగా ఒక్క డాలర్ విలువ రూ.144కు చేరింది. ఫలితంగా దాయాదిదేశం పాకిస్థాన్ ఆర్థిక కష్టాల్లో కూరుకుంటుంది. 
 
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా వారంతా వేడుకలు కూడా జరుపుకున్నారు. ఆ తర్వాతి రోజే డాలరుతో పాకిస్థాన్ కరెన్సీ విలువ ఏకంగా రూ.10 తగ్గిపోయింది. 
 
దేశానికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయంటూ 100 రోజుల పాలన సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పినా.. కరెన్సీ పతనాన్ని ఆపలేకపోయింది. మార్కెట్‌లో ఓ రకమైన భయం నెలకొన్నదని, అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారి ఒకరు వెల్లడించారు.
 
ఇకపోతే, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి బెయిల్ ఔట్ ప్యాకేజీ అందుకోవడంలో భాగంగా కావాలనే రూపాయి విలువను తగ్గించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యే ఐఎంఎఫ్ అధికారులు పాకిస్థాన్‌లో పర్యటించిన సందర్భంగా చైనా చేస్తున్న ఆర్థిక సాయాన్ని వెల్లడించడంతోపాటు ఇంధన ధరలను పెంచాలని, మరిన్ని పన్నులు విధించాలని, రూపాయి విలువను తగ్గించుకోవాలన్న షరతులు విధించింది. ఈ కారణంగానే పాక్ కరెన్సీ విలువ పడిపోతుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments