Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో 'క్యాంపస్ టు కార్పొరేట్' కార్యక్రమాన్ని హిందూస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ విస్తరణ

ఐవీఆర్
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (20:05 IST)
భారతదేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ఆహాన్ కన్సల్టింగ్ భాగస్వామ్యంతో, తమ ప్రశంసలు పొందిన 'క్యాంపస్ టు కార్పోరేట్ ప్రోగ్రామ్' పరిధిని తెలంగాణలో విస్తరించేందుకు సిద్ధం అయింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నుండి 2024లో దాదాపు 5,000 మంది ఆఖరి సంవత్సరం డిప్లొమా విద్యార్థులను ఉపాధి నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈరోజు ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీ సి.శ్రీనాథ్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖులలో శ్రీ పుల్లయ్య, సెక్రటరీ, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET), తెలంగాణ, శ్రీ. నర్సయ్య గౌడ్, ప్రిన్సిపాల్, GPW, సికింద్రాబాద్, శ్రీ శ్రీకాంత్ సిన్హా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్, అండ్ నాలెడ్జ్ (టాస్క్), శ్రీ  ప్రణవ్ షీల్, జోనల్ వైస్ ప్రెసిడెంట్ - కమర్షియల్, హెచ్‌సిసిబి వున్నారు.
 
ఈ కార్యక్రమం ఉత్పాదక భాగస్వామ్యం యొక్క గణనీయమైన విస్తరణకు ప్రాతినిధ్యం వహిస్తుంది, 2022లో కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి, తెలంగాణ వ్యాప్తంగా 15,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఇప్పటికే దాని ప్రారంభ మైలురాయిని అధిగమించింది. ఈ విజయం 2023-24 విద్యా సంవత్సరం నాటికి అదనంగా 10,000 కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో గత సంవత్సరం హెచ్‌సిసిబి, టాస్క్ మధ్య సంతకం చేసిన ఇటీవలి మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MOU)కు అనుగుణంగా వుంది. 
 
శ్రీ సి.శ్రీనాథ్, రీజినల్ జాయింట్ డైరెక్టర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ మాట్లాడుతూ, “మన యువతకు గణనీయమైన వాగ్దానాలు, అవకాశాలను తెలంగాణ కలిగి ఉంది. విద్యార్థులను వృత్తిపరమైన బాధ్యతల్లోకి సాఫీగా తీసుకువెళ్లడంలో ‘క్యాంపస్ టు కార్పోరేట్’ వంటి కార్యక్రమాలు కీలకమైనవి. మా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడంలో, తెలంగాణ అభివృద్ధి కథలో చెప్పుకోదగ్గ భాగం కావడంలో హెచ్‌సిసిబి చేస్తున్న కృషి, అందిస్తున్న సహకారాన్ని మేము స్వాగతిస్తున్నాము" అని అన్నారు. 
 
హెచ్‌సిసిబిలో చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్, సస్టైనబిలిటీ ఆఫీసర్ శ్రీ హిమాన్షు ప్రియదర్శి మాట్లాడుతూ, “తెలంగాణ అభివృద్ధి- శ్రేయస్సు పట్ల హెచ్‌సిసిబి లోతుగా కట్టుబడి ఉంది, గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌ రెడ్డితో మా ఇటీవలి చర్చల సందర్భంగా ఇది హైలైట్ చేయబడింది. మా 'క్యాంపస్ టు కార్పోరేట్ ప్రోగ్రామ్' ద్వారా, నేటి జాబ్ మార్కెట్ యొక్క డైనమిక్ స్వభావాన్ని ఉపయోగించుకోవడం, వారికి ఉపాధి కల్పించేందుకు తగిన నైపుణ్యాలతో యువ నిపుణులను సన్నద్ధం చేయడం మా లక్ష్యం. రాష్ట్ర యువతకు సాధికారత కల్పించడం, సానుకూల సమాజ మార్పును నడిపించడం, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడం కోసం అంకితభావంతో మేము దృఢంగా ఉన్నాము. భవిష్యత్తు గురించి, శక్తివంతమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో మా పాత్ర గురించి మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments